Mudragada vs Pawan: పిఠాపురంలో ముద్రగడ వర్సెస్ పవన్.. ఇద్దరూ బరిలో దిగితే కాపు ఓట్లెవరికి?

Mudragada Padmanabham vs Pawan Kalyan
x

Mudragada vs Pawan: పిఠాపురంలో ముద్రగడ వర్సెస్ పవన్.. ఇద్దరూ బరిలో దిగితే కాపు ఓట్లెవరికి?

Highlights

Mudragada vs Pawan: పవన్‌కు లేఖాస్త్రం సంధించడంపై కాపు నేతల నుంచి వ్యతిరేకత!

Mudragada vs Pawan: పిఠాపురంలో ముద్రగడ వర్సెస్‌ పవన్‌ కళ్యాణ్‌.. అదే నిజమైతే కాపు వర్గం సపోర్ట్ ఎవరికి..? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న ముద్రగడకు తాను నమ్ముకున్న వారంతా ఓటేస్తారా..? పవన్‌ క్రేజ్‌ ముందు ముద్రగడ నిలుస్తారా..? ఉద్యమ కాలం నాటి నేతలు ఎంతమంది ముద్రగడ వెనుక నడుస్తారు.. అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వారాహి యాత్రతో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ ప్రకంపనలు రేగాయి. గోదావరి జిల్లాలో పవన్‌ యాత్ర ఎంట్రీ అయ్యే నాటి నుంచి అక్కడి రాజకీయాలన్నీ కాపుల చుట్టే తిరుగుతున్నాయి. వారాహి యాత్రలో పవన్‌ వైసీపీ నేతలపై విమర్శలు చేయగా.. కౌంటర్‌గా ముద్రగడ పద్మనాభం లేఖ విడుదల చేయడం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అప్పటినుంచి పొలిటికల్ సర్కిల్స్‌లో కాపుల మీదే చర్చ జరుగుతోంది.

రాబోయే ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమంతో రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపిన ముద్రగడ.. ఆ తర్వాత కేసులతో సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల ఆ‍యన వైసీపీలో చేరతారనే ప్రచారం జరగ్గా.. పలువురు వైసీపీ నేతలు కూడా ముద్రగడను కలిశారు. ఇక ఇటీవల పవన్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని ముద్రగడ సవాల్‌ విసరడంతో.. ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనేది దాదాపు ఖరారైంది.

అయితే పవన్‌కు లేఖాస్త్రం సంధించిన ముద్రగడపై పవన్ అభిమానులతో పాటు కాపు నేతలు కూడా మండిపడ్డారు. ముద్రగడ తీరును ఎండగట్టారు. గతంలో కాపు ఉద్యమం నడిపిన సమయంలో ముద్రగడకు కాపు నేతలు అండగా నిలిచారు. అయితే ముద్రగడ ఎన్నికల బరిలో దిగితే ఇప్పుడు అందులో ఎంతమంది ఆయన వెంట నడుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రీసెంట్‌గా కాపు నేతలు ముద్రగడకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ద్వారంపూడికి సపోర్ట్ చేయడంతో.. కాపు నేతలు, జనసేనలోని కాపు కార్యకర్తలు ఆయనకు మనీ ఆర్డర్‌లు పంపడం కూడా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆయనకు కాపు నేతల అండ ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్న.

కాపు ఉద్యమ నేతల సంగతి అలా ఉంటే.. ఇప్పుడున్న యువత ముద్రగడకు ఓటేస్తారా అనేది కూడా ఓ ప్రశ్నే. ఎందుకంటే ఇప్పుడు పవన్‌ మీద వారికి ఉన్న క్రేజ్ ముద్రగడపై ఉండదు. కాపు ఫీలింగ్‌ యువతలో తీసుకురావడం.. ఓటేసేలా తమవైపు తిప్పుకోవడం కాస్త కష్టమైన విష‍యమే. ఇక పవన్‌ కళ్యాణ్‌ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అక్కడి పరిసర ప్రాంతాల వారంతా పవన్‌కు సపోర్ట్‌గా నిలుస్తుండటంతో.. ముద్రగడ వెనుక ఎవరు ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories