MP Raghurama: ఏపీ సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు

MP Raghurama Krishna Raju Issued Legal Notice to CID Additional DGP
x

MP Raghurama Krishna Raju:(File Image) 

Highlights

MP Raghurama: అరెస్టు సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్ ను తీసుకున్నారని, దాన్ని తిరిగిచ్చేయాలని నోటీసులో కోరారు.

MP Raghurama: ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారనే నెపంతో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ను గత నెల 14వ తేదీ సాయంత్రం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి రాజద్రోహం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్టు సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తిరిగిచ్చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ ను ఉద్దేశిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని రఘురామ ఆరోపించారు. ఆ ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోన్ లో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. మంగళగిరి సీఐడీ హెచ్ఎస్ఓకు ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories