AP Cinema Tickets: ఏపీలో గందరగోళంగా సినిమా టికెట్ల వ్యవహారం

Movie Tickets Prices Issues In Andhra Pradesh
x

AP Cinema Tickets: ఏపీలో గందరగోళంగా సినిమా టికెట్ల వ్యవహారం

Highlights

AP Cinema Tickets: కొన్ని సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు, మరికొన్నింటికి తగ్గింపు

AP Cinema Tickets: ఆన్ లైన్ల మూవీ టికెట్ల విక్రమయం చిక్కుముడీ ఏపీలో ఇంకా కొనసాగుతోంది. సినీ పరిశ్రమకు సంబంధించి ఇక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, జీవోలు, అందులోని అంశాలు ఇలా అన్నీ వివాదాస్పదంగానే మారుతున్నాయి. తాజాగా టికెట్ రేట్ల అమ్మకాలపై జగన్ సర్కార్ విడుదల చేసిన జీవో..మరోసారి ఆడియన్స్‎లో కన్ఫ్యూజన్ ‎కు గురిచేస్తోంది. తొలత సినిమా టికెట్ రేట్లను తగ్గించటం‌, సుధీర్ఘంగా జరిగిన చర్చలు అనంతరం వాటిని మరలా కొద్దిమేర పెంచటం.. కొన్ని సినిమాలకు రేట్లను తగ్గించటం లాంటి చర్యలతో ఏకపక్షంగా వ్యవహరించిందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సినీ ప్రముఖుల రిక్వెస్ట్ మేరకు తాజాగా ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మే పోర్టల్‎ను తెరమీదకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో సినిమా టికెట్ల విషయంలో చాలా రాద్ధాంతం జరిగింది. తొందరపాటు నిర్ణయాలు వల్ల రాష్ట్ర ప్రభుత్వం‌ పలు మార్లు విమర్శలు పాలైంది కూడా... అయినప్పటికీ ఏపీ సర్కారు ఓ క్లారిటీ ఇవ్వలేకపోగా.. పూటకో తిరకాసు పెడుతూనే ఉంది. ఆన్‎లైన్ టికెట్ల విషయంలో స్థిరమైన నిర్ణయం లేకుండా వ్యవహరిస్తొందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినీ ప్రముఖులు కోరినట్లుగా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. లేదా గతంలోలా ప్రైవెట్ పోర్టల్స్ కు వదిలేస్తెనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కొత్తగా ఆన్ లైన్ టికెట్లపై ప్రభుత్వం విధించిన 1.95 శాతం కమీషన్ ప్రభుత్వమే తీసుకుంటోందని ప్రచారమూ జోరందుకుంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం 1.95 శాతం కమీషన్ లో 0.95శాతం సర్వీస్ ప్రొవైడర్ కి, మిగిలిన 1 శాతం పరిశ్రమ అభివృద్ధికి వెళ్తుందని చెబుతోంది.

ఏపీలో ఈ ఆన్ లైన్ టికెటింగ్ పకడ్భంధీగా అమలు చేస్తామంటున్న ప్రభుత్వం ఈ వ్యవహారంతో రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, తమ సీటింగ్ కెపాసిటీతోపాటు, ప్రతి టికెట్ ఆన్ లైన్‎లోనే అమ్మడంపై స్పష్టమైన ఆదేశాలివ్వాలి. ఇక ఇంటి దగ్గరే ఆన్‎లైన్‎లో బుక్ చేసుకునే వారితో పాటు, థియేటర్‎కి వచ్చి అక్కడ కౌంటర్లో ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకునే వెసులుబాటును ఇవ్వటం కొంత సినిమా ప్రేక్షకులకు ఉపయోగకరమే.. అయితే నిన్నటివరకు ప్రైవేట్ పోర్టల్స్ థియేటర్లతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్ చేసి ఎక్కువ రేటుకి అమ్మిన సందర్భాలున్నాయి. కానీ ఎఫ్డిసి ప్రభుత్వ పోర్టల్ కాబట్టి, ఆ సమస్య ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆన్‎లైన్‎లో బల్క్ గా బుక్ చేసుకున్నవారు థియేటర్ల వద్ద బ్లాక్ మార్కెటింగ్ పాల్పడితే పరిస్దితి ఏమిటన్నదానిపై ప్రభుత్వం వద్ద సమాధానం చెప్పలేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఇక త్వరలో థియేటర్ల ఓనర్లతో ఎఫ్.డి.సి. తరపున ఎంవోయూ కుదుర్చుకోడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు సినిమా థియేటర్లలో టికెట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్ముతామని చెబుతూ.. మళ్లీ ప్రైవేట్ సంస్థలు కూడా ఆన్ లైన్ లో టికెట్ కొనుక్కోవచ్చు అనే ఆప్షన్ ఎందుకిచ్చారో ఎవరికి అంతుచిక్కడం లేదు. తిరిగి ఆయా సంస్థలు తమ కమిషన్ ని కలుపుకుని టికెట్ రేట్లు పెంచితే, దానికి ప్రభుత్వమే అవకాశం కల్పించినట్లవుతొందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్లు రేట్లు,అమ్మకాల వ్యవహారాన్ని నెత్తిమీదకెత్తకున్న ప్రభుత్వం... ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది..? ఈసారి ఎలాంటి మార్పులు,చేర్పులు చేబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories