Mobile Online Classes: ఏజెన్సీ వాసులకు మొబైల్ ఆన్ లైన్ తరగతులు..

Mobile Online Classes: ఏజెన్సీ వాసులకు మొబైల్ ఆన్ లైన్ తరగతులు..
x
Mobile Online Classes
Highlights

Mobile Online Classes: కరోనా పుణ్యమాని అన్నీ చదువంతా ఆన్ లైన్ లోనే. ప్రతి ఇంటా రోజూ పిల్లలు వీటిపైనే ధ్యాస పెట్టి తరగతులు వింటున్నారు.

Mobile Online Classes: కరోనా పుణ్యమాని అన్నీ చదువంతా ఆన్ లైన్ లోనే. ప్రతి ఇంటా రోజూ పిల్లలు వీటిపైనే ధ్యాస పెట్టి తరగతులు వింటున్నారు. ఇదంతా నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే.. మరి నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటి? అందుకే ప్రభుత్వం ఇలా నెట్ వర్క్ లేకుండా ఆన్ లైన్ తరగతులను వినియోగించుకోలేని విద్యార్ధులకు ఆన్ లైన్ పద్ధతిలో పాఠ్యాంశాలు భోదించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొబైల్ పద్ధతి ద్వారా ఇలాంటి వారందరికీ ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు సంకల్పించింది. వీటిలో విద్యార్థులకు భోదించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసింది. వీటిని వినియోగించుకుని కరోనా కాలంలో సైతం భోధనకు అడ్డలేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది.

కరోనా మహామ్మారి వ్యాప్తి చెందుతుండటంతో అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. పిల్లలు చదువులు ఆన్ లైన్ లో కి మారిపోయాయి. అయితే ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో లేని గ్రామాల్లో విద్యార్థుల కోసం విద్యావారధి వాహనాలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యావారధి ద్వారా డిజిటల్‌ విద్యను అందించనుంది. ఈ వాహనాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యావారధి పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు తెరవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నీ అందుబాటులో ఉండవని… ఇందుకు పరిష్కార మార్గంగా విద్యావారధి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

ఈ-విద్యావారధిలో ఇవే ప్రత్యేకతలు..

ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌తో కూడిన ఈ-మొబైల్‌ వాహనాల ద్వారా గ్రామాల్లోని విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. ఈ వాహనంలో చిన్న లైబ్రరీ, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలు అన్నీ అందులో పొందుపర్చారు. ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కొండ ప్రాంతాల్లో ఈ-మొబైల్‌ వ్యాన్‌లను వినియోగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories