ఆమె రంగంలోకి దిగారంటే..ఈమె సీన్‌లోకి ఎంటరవుతారు.. రాజకీయాలకు మించి ఈ మగవుల మధ్య పగ వుందా?
ఇద్దరూ ఒకప్పుడు వెండితెరను రఫ్ఫాడించిన తారామణులే. ఇప్పుడు కూడా పొలిటికల్ స్క్రీన్‌పై చెలరేగిపోతున్న స్టార్సే. ఒక లేడీ లీడర్ మైక్ అందుకున్నారంటే చాలు,...
ఇద్దరూ ఒకప్పుడు వెండితెరను రఫ్ఫాడించిన తారామణులే. ఇప్పుడు కూడా పొలిటికల్ స్క్రీన్‌పై చెలరేగిపోతున్న స్టార్సే. ఒక లేడీ లీడర్ మైక్ అందుకున్నారంటే చాలు, వెంటనే మరో చోట కౌంటర్ ఇచ్చేందుకు మరో మహిళా నాయకామణి సిద్దమవుతారు. ఆమె కోసమే, ఈమెను చంద్రబాబు రంగంలోకి దించారట. ఇప్పుడు కూడా ఆ పొలిటికల్ స్టార్స్, డైలాగ్స్ వార్‌తో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇంతకీ వారెవరో మీకిప్పటికే అర్థమైంది కదా అవును. ఆర్కే రోజా దివ్యవాణి. ఇంతకీ ఈ కథానాయికల మధ్య, రాజకీయాలకు మించిన గొడవలు ఏమైనా వున్నాయా?
ఆమె రంగంలోకి దిగారంటే ఈమె సీన్‌లోకి ఎంటరవుతారు. రోజా కౌంటర్‌కు దివ్యవాణి ఎన్‌కౌంటర్ వేసేస్తారు. రాజకీయాలకు అతీతంగా ఈ మగవుల మధ్య పగ వుందా? వెండితెర టు పొలిటికల్ స్క్రీన్ ఈ తారల మధ్య రగులుతున్నదేంటి?
ఆర్కే రోజా, దివ్యవాణి ఇద్దరూ పరిచయం అక్కర్లేని మహిళామణులు. అటు సినిమా తెరను ఒక ఊపు ఊపారు రాజకీయ తెరపైనా దూకుడు మీదున్నారు. ఒకరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో కీలమైన నాయకురాలిగా చెలరేగిపోతుంటే, మరొకరు టీడీపీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇద్దరు నాయకామణులు కూడా, లౌడ్ స్పీకర్సే. మైక్ పట్టారంటే, దుమ్ము దులిపేస్తారు. ముఖ్యంగా ఒకరిపై మరొకరు ఓ రేంజ్‌లో విమర్శల బాణాలు సంధించుకుంటారు.
ఇద్దరూ చెరో పార్టీలో వుండి, విమర్శల వర్షం కురిపించుకుంటారు. రోజా గనుక చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే, వెంటనే టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమై, రోజా కామెంట్లకు కౌంటర్ ఇస్తారు దివ్యవాణి. కేవలం రోజాను టార్గెట్ చేసుకుని మాటల దాడి చేస్తారు. తాజాగా, మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి వేదికైంది అమరావతి ఆందోళన.
రోజాకు రాజధాని గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ సమ్మిట్‌లో పాల్గొన్నారు రోజా. విషయం తెలుసుకున్న రాజధాని రైతులు, అడుగడుగునా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధాని అమరావతి విషయంలో ఎమ్మెల్యే వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు భారీగా చేరుకున్నారు. రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్తత కొనసాగింది.
రైతుల ముసుగులో టీడీపీ గూండాలతో చంద్రబాబు తనపై దాడి చేయించారని ఆరోపించారు రోజా. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాగే జరిగితే ప్రజాచైతన్యయాత్ర కదలకుండా చేస్తామని చంద్రబాబు డ్రామాలు ఆపకపోతే తగిన శాస్తి జరుగుతుందన్నారు.
అలా రోజా మాట్లాడారో లేదో, వెంటనే టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు, ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి. రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవైపు ఏపీలో ముఖ్యమంత్రిగా చెప్పుకునే జగన్ రాజధాని రైతుల ముందుకు రాకుండా దొంగదారిన వెళ్లిపోతున్నారని, ఇప్పుడు ఎమ్మెల్యే రోజా కూడా ప్రజల మధ్యలోకి రాలేక, కారు దిగకుండా దొంగదారిన వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేయడం కాదని, రోజాపై సెటైర్లు విసిరారు దివ్యవాణి.
రోజా ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా, వెంటనే రంగంలోకి దిగుతారు దివ్యవాణి. అసలు దివ్యవాణిని టీడీపీలోకి తీసుకుందే, రోజాకు పోటీగా అని, నాడే అర్థమైంది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజాకు, అదే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వాలంటే అదే రంగంలో వున్న తారామణులే కరెక్టని చంద్రబాబు భావించినట్టున్నారు. అందుకే ఎన్నికల ముందు దివ్యవాణికి పార్టీ సభ్యత్వం ఇస్తూనే, ఏకంగా అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టారు. చంద్రబాబుపై అదేపనిగా విమర్శల దాడి చేసే రోజాకు, కౌంటర్ ఇవ్వడానికే దివ్యవాణిని ఈ హోదా కట్టబెడుతున్నారని నాడే అర్థమైంది. దానికి తగ్గట్టుగానే, చంద్రబాబు ఇచ్చిన బాధ్యతలకు వందశాతం న్యాయం చేసేందుకు, రోజాపై చెలరేగిపోతూనే వున్నారు దివ్యవాణి. అసెంబ్లీ ఎన్నికల టైంలో, ఏకంగా రోజా పోటీ చేసిన నగరికి వెళ్లి, ఆమెను మామూలుగా ఆడిపోసుకోలేదు దివ్యవాణి.
ఎన్నికల టైంలో, పసుపు కుంకుమ పథకంపై వీరి మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని, తెలుగు ప్రజలు మర్చిపోలేరు. రాజకీయ తారామణుల మాటల తూటాలు, ఆటంబాంబుల స్థాయిలో పేలుతాయా అని, షాకయ్యారు. మొత్తానికి రోజాకు కౌంటర్ వేసేందుకే, దివ్యవాణిని చంద్రబాబు సీన్‌లోకి ప్రవేశపెట్టినా, రోజా మాత్రం నేరుగా దివ్యవాణిపై స్పందించిన దాఖలాలు తక్కువ. కేవలం చంద్రబాబునే టార్గెట్ చేస్తారు. చంద్రబాబును టార్గెట్ చేసిన రోజాను దివ్యవాణి టార్గెట్ చేస్తారు. ఇద్దరు పొలిటికల్ స్టార్ల డైలాగ్ వార్ మాత్రం, మీడియాలో హోరెత్తుతూనే వుంటుంది.
2014 నుంచి 2019 వరకు, అసెంబ్లీలో రోజాకు, నాడు టీడీపీ ఎమ్మెల్యేగా వున్న అనితకు మధ్య మాటల ఎలా సాగేదో అందరూ చూశారు. ఇప్పుడు అనిత కాస్త సైలెంటయ్యారు. కానీ మొదటి రోజు నుంచి దివ్యవాణి, మాటల తూటాలు పేలుస్తూనే వున్నారు. సినిమా రంగంలో వున్నప్పుడు వీరమధ్య పెద్దగా విభేదాలేమీలేవని తెలుస్తోంది. కానీ రాజకీయాల్లోకి వచ్చాక, తిట్టుకోక తప్పనిసరి పరిస్థితి. అందుకే లేడీ స్టార్‌కు పోటీగా, దివ్యవాణిని యుద్దంలోకి దింపారు చంద్రబాబు. నగరిలో రోజాకు పోటీగా దివ్యవాణికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా, ఎందుకనో లాస్ట్‌మినిట్‌లో వర్కౌట్ కాలేదు. మొత్తానికి ఎప్పటికప్పుడు రోజా, దివ్యవాణి మధ్య సాగుతున్న మాటల యుద్ధాన్ని, జనాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire