Narasaraopeta: ప్రభుత్వ ఇళ్లను త్వరిగతిన అధికారులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

Narasaraopeta: ప్రభుత్వ ఇళ్లను త్వరిగతిన అధికారులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
x
Highlights

పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో నియోజకవర్గానికి సంబంధించి పేదలందరికీ ఇళ్లు, నవరత్నాలు అందుచేతపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

నరసరావుపేట: పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో నియోజకవర్గానికి సంబంధించి పేదలందరికీ ఇళ్లు, నవరత్నాలు అందుచేతపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వివరాలను, సమస్యాత్మకంగా ఉన్న భూముల గురించి అధికారులు వివరించారు.

ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించాలని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అధికారులు ఎక్కడా లోటుపాట్లు లేకుండా పూర్తి చెయ్యాలని అన్నారు. కోటప్ప కొండ వద్ద జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు త్వరగా పూర్తి చెయాలని.. వినుకొండ ప్రాంత అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయించడం పై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అధికారులను ప్రశ్నించారు. వినుకొండ ప్రాంత అభివృద్ధికి కూడా పెద్ద పీట వెయ్యాలని ఆదేశించారు. రానున్న రెండేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, ఆయా మండలాల ఎమ్మార్వోలు, మండల అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories