ఐదు రోజులైనా దొరకని బాలిక ఆచూకీ.. మృతదేహం కోసం విస్తృత గాలింపు

Missing girl for five days Wide search for body
x

ఐదు రోజులైనా దొరకని బాలిక ఆచూకీ.. మృతదేహం కోసం విస్తృత గాలింపు

Highlights

బాలిక హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.

నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 4వ రోజు కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మస్థ్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జులై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది. ముగ్గురు మైనర్ బాలురను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేసామని సదరు మైనర్ బాలురు చెప్పారు. దీంతో మొదట కాలువలో ఒక చోట పడేసామని చెప్పిన మైనర్ బాలురు.. ఆ తరువాత కాలువలో పంప్ హౌస్ సమీపంలో పడేసామని మరోసారి చెప్పారు.

అయితే, ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కాలువలో 9వ తేది సాయంత్రం నుంచి బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆధునిక కెమెరాలు నీటిలోకి పంపి గాలించిన సిబ్బంది.. అయినా చిన్నారి మృతదేహం జాడ దొరకలేదు. అయితే, మరోవైపు బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఆందోళనకు దిగారు. అదృశ్యమైన వాసంతిని ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారని వాసంతి తల్లిదండ్రులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు కేజీ రోడ్డుపై ధర్నా విరమించే లేదని ఆందోళన చేశారు.

మూడు రోజులుగా స్థానిక మత్స్యకారులు వలలతో గాలిస్తున్నారు. మరోవైపు గజఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్‌ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.

మరోవైపు ఘటనా స్థలంలో క్షుద్ర పూజల ఆనవాలు కూడా ఉండటంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలురు ఇచ్చిన సమాచారం వాస్తవమేనా..? మరొక కారణం ఏమైనా ఉందా అని దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మరోవైపు బాలిక కేసు మిస్టరీ పట్ల జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

బాలిక హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన తనను కలచి వేసిందన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నేరాలను రాష్ట్ర ప్రభుత్వం సహించదన్నారు. ఆడబిడ్డల రక్షణకు సంస్థాగత స్థాయి మెకానిజం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. బాలిక హత్యాచార ఘటన నిందితులను వదిలే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత ఘటనపై ఆరా తీశారు. కేసు మిస్టరీని తేల్చాలని పోలీసులను ఆదేశించారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ రఘువీర్ రెడ్డి ఇతర అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీ శబరి స్వగ్రామం కూడా ముచ్చు మర్రి కావడంతో ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య బాలిక మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలిక కుటుంబీకులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories