Vizag: భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని.. మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళన

Miss Vizag Nakshatra Caught Her Husband With Second Wife
x

Vizag: భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని.. మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళన

Highlights

Miss Vizag: విశాఖలో మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళనకు దిగింది.

Miss Vizag: విశాఖలో మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళనకు దిగింది. తన భర్త విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లాడాడని ఆరోపిస్తున్న నక్షత్ర.. భర్త మరో మహిళతో రూమ్‌లో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. 2013లో ఓ సినిమా షూటింగ్‌లో తేజ, నక్షత్ర మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2017లో తేజని ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే.. ఇప్పుడు తన భర్త తనకు కావాలంటూ నిరసన చేపట్టింది. ఇదిలా ఉంటే.. మరోవైపు.. తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారంటూ భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందన్నాడు. ఇక.. అది తన సినిమా ఆఫీస్‌ అని.. రూమ్‌లో ఉన్న అమ్మాయి ఆడిషన్స్‌ కోసం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories