Chellaboina Venugopal: అమెరికాలో ఉన్న సిలబస్ ను ఏపీలో అమలు చేస్తాం.

Chellaboina Venugopal: అమెరికాలో ఉన్న సిలబస్ ను ఏపీలో అమలు చేస్తాం.
x
Highlights

Chellaboina Venugopal: ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి ప్రోత్సాహక అవార్డు

Chellaboina Venugopal: ఏపీలో ఇంటర్నేషనల్ సిలబస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లగించారు. ఒకటో తరగతి నుంచి ప్రారంభించి మిగతా తరగతులకు విస్తరిస్తామన్నారు. అలాగే ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు.. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రిటైర్‌మెంట్ అయిన ఉద్యోగులకు ఇంటి స్థలం, ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష, మెయిన్ పాస్ అయితే 50 వేల ప్రోత్సాహక అవార్డు ఇస్తామన్నారు. కాకినాడ బల్క్ డ్రగ్ పార్కును నక్కపల్లిలో ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఏపీ జీఎస్టీ చట్ట సవరణకు, దేవాదాయ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories