సీలేరు దుర్ఘటనపై స్పందించిన మంత్రి నాని.. బాధితులకు అండగా ఉంటామని హామీ

Minister Alla Nani Inquires About Two Boats Capsized in the Sileru River In Visakhapatnam District
x

సీలేరు దుర్ఘటనపై స్పందించిన మంత్రి నాని

Highlights

Boat Capsized: విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డా దుర్ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.

Two Boats Capsized: విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డా దుర్ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ప్రమాదంలో గల్లంత్తైనా వారి కోసం సత్వరమే గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం చేయాలని ఆదేశించారు. ఘటనలో ఒక చిన్నారి మృతి చెందడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు, ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీకి మంత్రి ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఒడిశాలోని కోందు గూడ గ్రామానికి చెందిన చాలామంది హైదరాబాద్ శివారులోని ఇటుకుల బట్టీలో పనులు చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమ మూతపడటంతో స్వగ్రామానికి బయలదేరారు. రోడ్డుమార్గంలో సీలేరుగుంట వరకు చేరుకున్న వారు నాటు పడవల ద్వారా కోందు గూడకు వెళ్లేందుకు పయనమయ్యారు. సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై కొంతమంది తొలివిడతలో గ్రామానికి సురక్షితంగా చేరుకున్నారు.

రెండో విడతలో ఐదు పడవలపై వారు ప్రయాణిస్తుండగా రెండు పడవలు ప్రమాదవశాత్తూ రిజర్వాయిర్‌లో బోల్తా పడ్డారు. అయితే ముగ్గురు మునిగిపోతున్న పడవలపై నిలబడి ప్రాణాలు దక్కించుకోగా 8 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఆరా తీసిన స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి సీలేరు జెన్కో అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే కోరారు. ఈ ఘటనపై మంత్రి ఆళ్లనాన్ని దిగ్భ్రాంతి వ్యక్తిచేశారు. మరోవైపు ప్రమాద సమాచారం తెలియగానే కోందు గూడ గ్రామస్థులు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్‌ గాలిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories