Jagtial District: మెట్‌పల్లి మండలంలో విజృంభిస్తున్న కరోనా

Metpally Villagers in Jagtial District Rushed to Jaggasagar PHC for Corona Test
x

కరోన వైరస్ (Representational Image)

Highlights

Jagtial District: టెస్టుల కోసం జగ్గాసాగర్ పీహెచ్‌సీకి పోటెత్తిన బాధితులు * ఆధార్‌కార్డులను వరుస క్రమంలో పేర్చిన జనాలు

Jagtial District: ఎరువుల కోసం రైతులు చెప్పులను క్యూలైన్లలో పేర్చడం చూశాం. డీలర్‌ షాపుల ముందు లబ్ధిదారులు సంచులను పెట్టి పోవడం చూశాం. కానీ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధార్‌ కార్డులు క్యూ కట్టాయి. కోవిడ పరీక్షల కోసం ఆధార్‌ కార్డులు వరుస కట్టాయి. జగ్గాసాగర్‌ ప్రాథమికఆరోగ్య కేంద్రాలను కరోనా టెస్టుల కోసం జనం భారీగా వచ్చారు.

అయితే వారందరు క్యూలైన్లో నిలబడితే కరోనా సోకుతుందని భయపడి తమ ఆధార్‌ కార్డులను వరుస క్రమంలో ఉంచారు. ఇక వైద్యసిబ్బంది ఒక్కో ఆధార్‌ కార్డును తీసుకొని వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే అందరికీ టెస్టులు చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. ఉదయం నాలుగు గంటలకు వచ్చి, ఆధార్‌కార్డును వరుస క్రమంలో ఉంచినా టెస్టులు చేయడం లేదంటున్నారు జనాలు.


Show Full Article
Print Article
Next Story
More Stories