Mekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం

Mekapati Vikram Reddy Win With a Huge Majority of 82,888 Votes
x

Mekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం

Highlights

Mekapati Vikram Reddy: 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన మేకపాటి విక్రమ్‌రెడ్డి

Mekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో ఫ్యాన్ గాలి వీచింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 82వేల 888 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి గెలిచారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్లు పూర్తయ్యేసరికి 82వేల 888 ఓట్ల ఆధిక్యంతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలిచారు. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 1లక్ష 2వేల 240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు 19వేల 352 ఓట్లు వచ్చాయి.

మొదటి రౌండ్ నుంచి కూడా మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు. ప్రధాన ప్రతిపక్షం ఏదీ బరిలో లేకపోవడంతో ఆయన గెలుపు సునాయసం అయింది. ప్రతి రౌండ్‌కి మేకపాటి భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. పోటీలో నిలిచిన మరే ఇతర పార్టీ అభ్యర్థి కూడా విక్రమ్‌ రెడ్డికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పోస్టల్‌ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌ సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్‌ ఓట్లలోనూ వైఎస్సార్‌ సీపీ భారీ ఆధిక్యం కనబర్చింది.

ఆత్మకూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏకపక్షంగానే సాగింది. మొదటి రౌండ్ లోనే ఐదు వేలకు పైగా లీడ్ సాధించిన విక్రమ్ రెడ్డి.. ప్రతి రౌండ్ లోనూ భారీ ఆధిక్యం సాధించారు. వైసీపీని ఓడిస్తామని ప్రకటించిన బీజేపీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. బీఎస్పీ అభ్యర్థి మూడో స్థానంలో నిలవగా.. నోటాకు నాలుగు వేలకు పైగా ఓట్లు వచ్చాయి. మొత్తం 20 రౌండ్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి లక్షా 2 వేల 74 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19 వేల 332 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఓబులేసుకు 4 వేల 897 ఓట్లు పోల్ కాగా.. నోటాకు 4 వేల 197 ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories