Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ మద్దతు

Megastar Chiranjeevi Supports Visakha Steel Plant Protection
x

మెగాస్టార్ చిరంజీవి (ఫోటో:ట్విట్టర్)

Highlights

Vizag Steel Plant: విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయ్: మెగాస్టార్

Vizag Steel Plant: 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయంటూ మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దాదాపు నెలరోజులుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా టిడిపి, వామపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ''విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తోన్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ..

'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా సాగించిన యద్ద భేరి ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. కాలేజీలో చదువుతున్న ఆ రోజుల్లో బ్రష్‌ చేత పట్టుకుని గోడపై విశాఖ ఉక్కు సాధిస్తాం అనే నినాదాన్ని రాశాం. విశాఖ ఉక్కు కర్మాగారానికి దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం' అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. .దాదాపు 35 మంది పౌరులతోపాటు 9ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. దాన్ని ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించాం. దీనిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 'విశాఖ ఉక్కు పరిరక్షణకు మీ మద్దతు మాకు కొండంత బలాన్ని ఇస్తుంది' అని గంటా పేర్కొన్నారు.

ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ ....

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం, అందువల్ల నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలలి. ఉద్యోగస్తులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలి'' అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories