ఏపీపీసీసీ అధ్యక్షుడుగా కిరణ్ కుమార్ రెడ్డి?

ఏపీపీసీసీ అధ్యక్షుడుగా కిరణ్ కుమార్ రెడ్డి?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్టు తెలుస్తోంది. ఆయన నియామకానికి సంబంధించి...

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్టు తెలుస్తోంది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏపీ పీసీసీ పదవికి మాజీ కేంద్ర మంత్రులు చింతా మోహన్, మంగమతి పల్లంరాజు పోటీ పడ్డారు. రాష్ట్ర మంత్రులుగా చేసిన సాకే శైలజానాధ్ కూడా పీసీసీ ఆశించారు.

కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పీసీసీ పదవి తీసుకునేందుకు అంత సుముఖంగా లేరని.. ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా కిరణ్ పనిచేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అయితే గడిచిన ఎన్నికల ముందే తిరిగి కాంగ్రెస్ లో చేరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories