కీలక మావోయిస్ట్ రైనో అరెస్ట్.. మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో..

Maoist Srinubabu Arrest in Andhra and Orissa Border
x

కీలక మావోయిస్ట్ రైనో అరెస్ట్.. మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో..

Highlights

కీలక మావోయిస్ట్ రైనో అరెస్ట్.. మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో..

Maoist Srinubabu: ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ‌కి చెందిన డివిజన్ కమిటీ మెంబర్ జనుమూరి శ్రీనుబాబు(రైనో)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైనో నుంచి ఒక ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 2018 సెప్టెంబర్‌ 23న జరిగిన మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో రైనో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. ఏవోబీ ప్రత్యేక జోన్‌ డివిజినల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న రైనో ఏఓబీలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టుగా ఉన్నాడు. గత ప్రభుత్వం రైనోపై రూ.5లక్షల రివార్డు ప్రకటించినట్టు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories