Kollu Ravindra: టీడీపీ నేత కొల్లు రవీంద్ర కు బెయిల్

Kollu Ravindra Bail for TDP leader Kollu Ravindra
x

ఇమేజ్ సోర్స్; వన్ ఇండియా.కం


Highlights

Kollu Ravindra: పోలీసులు ప్రొసీజర్‌ ఫాలో కాలేదని అభిప్రాయపడిన న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు చేశారు.

Kollu Ravindra: మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరైంది. పురపాలక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నిన్న కొల్లు రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై 356, 506, 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా కొల్లు రవీంద్రను న్యాయమూర్తి ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై నిన్న దురుసుగా ప్రవర్తించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ఉదయం 6 గంటలకే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రవీంద్ర వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లు రవీంద్ర ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

కొల్లు రవీంద్ర అరెస్ట్ నేపథ్యంలో ఉదయం నుంచి మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయాన్నే కొల్లును అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు చేరకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రవీంద్రను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను కార్యకర్తలు, అభిమానులు అడ్డుకున్నారు. రవీంద్రను పోలీసు వాహనం ఎక్కనీయకుండా అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు వారిని పక్కకు తొలగించేందుకు యత్నించగా కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు కార్యకర్తలను అడ్డుతొలగించిన పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ప్రొసీజర్‌ ఫాలో కాలేదని అభిప్రాయపడిన న్యాయమూర్తి .. కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories