Nara Lokesh's srikakulam tour: వడ్డీతో సహా చెల్లిస్తాం.. శ్రీకాకుళం పర్యటనలో లోకేశ్

Nara Lokeshs srikakulam tour: వడ్డీతో సహా చెల్లిస్తాం.. శ్రీకాకుళం పర్యటనలో లోకేశ్
x
Highlights

Nara Lokesh's srikakulam tour: Lokesh srikakulam tour: మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి పై ప్రభుత్వం కక్షసాధిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారు లోకేష్. జగన్‌ సర్కార్‌ను బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడ్ని టార్గెట్ చేశారని, ఉద్దేశపూర్వకంగానే ఈఎస్ఐ స్కాంలో ఇరికించారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో లోకేశ్ పర్యటించారు.

Lokesh srikakulam tour: మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి పై ప్రభుత్వం కక్షసాధిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారు లోకేష్. జగన్‌ సర్కార్‌ను బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడ్ని టార్గెట్ చేశారని, ఉద్దేశపూర్వకంగానే ఈఎస్ఐ స్కాంలో ఇరికించారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అచ్చెన్నాయుడు సతీమణి మాధవి, కుమారుడిని కలిసి ధైర్యం చెప్పారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇసుక మాఫియాను బయటపెట్టినందుకు కూన రవికుమార్‌ని ఇబ్బంది పెట్టారని, మాన్సాన్ ట్రస్ట్ నుంచి అశోక్‌గజపతిరాజును బయటకు పంపారని.. 10శాఖలకు మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు.

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని లోకేశ్ మండిపడ్డారు. దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు.. అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన అన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి తీసుకోవాలేమో అని ఎద్దేవా చేశారు. భర్త భార్యకు మెసేజ్ పెట్టాలన్నా భయపడాల్సి వస్తుందని లోకేశ్ సెటైర్స్ వేశారు.

తమ పార్టీ నేతలను ఇబ్బందిపెట్టి పార్టీల్లోకి లాగేస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. చాలామంది నేతలకు మైన్స్, గ్రానైట్స్ ఉన్నాయని.. వారిని బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారన్నారు. అధికార పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటే.. వైఫల్యాలపై ప్రశ్నించిన వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి అందరిపై కేసులు పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. లోకేష్ వెంట ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు. అంతకుముందు కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు వెళ్లి ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories