Lockdown in west godavari: ఏపీలో ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..

Lockdown in west godavari: ఏపీలో ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..
x
LOCKDOWN IN WEST GODAVARI
Highlights

Lockdown in west godavari: ఏపీలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో వందల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వేలల్లో చేరుకున్నాయి. ఆదివారం ఏకంగా ఐదువేలు దాటాయి

Lockdown in west godavari: ఏపీలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో వందల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వేలల్లో చేరుకున్నాయి. ఆదివారం ఏకంగా ఐదువేలు దాటాయి. దాంతో ప్రజలు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ స్వీయ లాక్ డౌన్ పాటిస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కూడా మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని యోచిస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో లాక్ డౌన్‌ విధించేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 31వ వరకు జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయాలనీ నిర్ణయించారు.

అందులో భాగంగా ఏలూరు, నరసాపురం, కొవ్వూరు తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరంలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు సమాచారం. లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని.. ఆ సమయంలో ప్రజలు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి సరుకులు కొనుగోలు చేసుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 11 గంటల తర్వాత నుంచి షాపులు మూసేవేయాలని.. ఎవరూ కూడా అత్యవసరం అయితే తప్పా బయటికి రాకూడదని పోలీసులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories