Tirumala: తిరుమల భక్తులకు ఊరట.. మెట్లమార్గంలో ఎట్టకేలకు చిక్కిన చిరుత..

Leopard Caught In Tirumala Footpath
x

Tirumala: తిరుమల భక్తులకు ఊరట.. మెట్లమార్గంలో ఎట్టకేలకు చిక్కిన చిరుత.. 

Highlights

Tirumala: అర్ధరాత్రి అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుత

Tirumala: తిరుమలలో అర్ద్రరాతి చిరుత చిక్కింది. చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను పట్టుకొనేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇదే సమయంలో చిన్నారులపై క్రూరమృగాల దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక మార్గంలో భక్తుల సంఖ్య తగ్గించటం పైనా కసరత్తు చేస్తోంది. దర్శన టికెట్ల కోటా పెంపు ద్వారా నడక మార్గంలో రద్దీ తగ్గింపు సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది.

అర్ద్రరాత్రి బోనులో చిక్కిన చిరుత: తిరుమలలొ చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను ఎట్టకేలకు తిరుమల అటవీ శాఖ అధికారులు బంధించారు. లక్షితను పులి బలి తీసుకోవటంతో వెంటనే అధికారులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో తిరుమలలో పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేసారు. బాలికపైన దాడి జరిగిన ప్రాంతంలోనే అర్ద్రరాత్రి ఆ బోనులో పులి చిక్కింది.

ఇదే సమయంలో అలిపిరి నుండి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో రాత్రి చిరుతల సంచారం కనిపించింది. దీంతో అయిదు పులలు తిరుమల అడవుల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కారణంగా భక్తులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను టీటీడీ ప్రకటించింది.

కాలి నడక మార్గంలో తాజా ఆంక్షలు: తిరుమలకు నడక మార్గంలో అయిదు పులుల సంచారం గుర్తించటంతో వెంటనే నిర్ణయాల అమలు ప్రారం చింది. 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడకన మార్గాల్లో ప్రవేశం పై ఆంక్షలు విధించింది. నడక మార్గంలో భక్తుల సంఖ్య తగ్గించటం పైనా కసరత్తు చేస్తోంది. దర్శన టికెట్ల కోటా పెంపు ద్వారా నడక మార్గంలో రద్దీ తగ్గింపు సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది.

నడక దారిలో వచ్చే భక్తులకు దర్శనం టికెట్ల కారణంగా పెద్ద సంఖ్యలో నడక మార్గంలో వస్తున్నారని.. తిరుమలలో శీఘ్ర దర్శన టికెట్ల కోటా పెంచటం ద్వారా నడక దారి మార్గంలో మొక్కులు ఉన్న వారనే వస్తారని, దీని ద్వారా రద్దీ నియంత్రణ చేయవచ్చనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇస్తున్న 15 వేల శ్రీఘ్ర దర్శనం టికెట్ల కోటాను 30 వేలకు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నడక మార్గంలో రద్దీ తగ్గించేలా: టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయాల్లో భాగంగా 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఆదివారం నుండే ఈ నిర్ణయం అమలవుతోంది.

అదేవిధంగా రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories