కాసేపట్లో SSLV D-1 ప్రయోగం

Launch of SSLV D-1 Shortly After
x

కాసేపట్లో SSLV D-1 ప్రయోగం

Highlights

SSLV D-1: రాకెట్‌ ప్రయోగానికి షార్‌లో సర్వం సిద్ధం

SSLV D-1: శ్రీహరి కోటలోని షార్ సెంటర్ నుంచి కాసేపట్లో SSLV D-1ను అంతరిక్షంలోకి ఇస్రో పంపనుంది. నిర్ణీత సమయానికి ఆరున్నర గంటల ముందు నుంచి కౌంట్ డౌన్ మొదలు కానుంది. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినులు రూపొందించిన ఆజాదిశాట్ శాటిలైట్ ను SSLV D-1 రాకెట్ కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. స్పేస్ కిడ్జ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ఈ శాటిలైట్ బరువు 8 కిలోలు. కేవలం 12 నిమిషాల్లోనే కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా విద్యార్థినులు ఈ శాటిలైట్ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. ఈ శాటిలైట్ లో ఏర్పాటు చేసిన సెల్ఫీ కెమెరాలు సొంత సోలార్ ప్యానెళ్లను, కమ్యూనికేషన్ ట్రాన్స్ పాండర్లను ఫొటోలు తీస్తాయి. మహిళలను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లో పాల్గొనేలా ప్రోత్సహించడమే అజాదిశాట్ అభివృద్ధి వెనుక లక్ష్యంగా దీనిని తయారు చేశారు. SSLV D-1 అన్నది ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన రాకెట్.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అరుదైన సరికొత్త ప్రయోగాలకు తెరతీసింది. ఇప్పటివరకు PSLV, GSLV లాంటి భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో ఈసారి చిన్న రాకెట్లను రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ SSLVకి రూపకల్పన చేసింది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అనవాయితీగా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. SSLV రాకెట్ నమూనాను చెంగాళమ్మ పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నింగిలోకి దూసుకెళ్లనున్న సరికొత్త రాకెట్ ప్రయోగం కోసం షార్ లో సర్వం సిద్ధమయ్యింది. ఉదయం 9 గంటల 18 నిమిషాలకు సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఇస్రో చైర్మన్ సోమనాత్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ ఛైర్మన్ పద్మకుమార్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తున్నారు.

34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ-డీ-1 నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తి కానుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇందనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇందనంతో 336.9 సెకన్లలో మూడో దశను 4.5 టన్నుల ఘన ఇందనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇందనాన్ని మండించి..742 సెకన్లలో 135 కిలోల బరువు కల్గిన మైక్రో శాట్-2ఏ ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత విద్యార్ధినులు తయారు చేసిన ఆజాది షాట్ ను భూమికి అతి దగ్గరగా 350 కిలో మీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని డిజైన్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories