తెలంగాణ ఎమ్మెల్యే వర్సెస్ ఏపీ ఎమ్మెల్యే.. రాజీనామాకు సిద్ధమన్న వైసీపీ ఎమ్మెల్యే

తెలంగాణ ఎమ్మెల్యే వర్సెస్ ఏపీ ఎమ్మెల్యే.. రాజీనామాకు సిద్ధమన్న వైసీపీ ఎమ్మెల్యే
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కాయి. తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తీవ్ర...

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కాయి. తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపందాల్చింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీని వెనక వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారంటూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రజాక్‌‌ను రంగంలోకి దింపి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. రాజాసింగ్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ విషయంపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి మాట్లాడుతూ.. హిందూత్వాన్ని అడ్డంపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో పైకిరావాలని బీజేపీ చూస్తోందని అన్నారు. రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదంటే రాజీనామాకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. శ్రీశైలంలో 40 ఏళ్లుగా శ్రీశైలంలో ముస్లింలు వ్యాపారాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రజాక్ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. నేను తోమ్మిది ఏళ్ల నుంచి మాత్రమే ఉన్నా. ఆయన పార్టీ కార్యకర్త మాత్రమే. సత్యదూరమైన ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదు. నేను ఎన్నో దేవాలయాలకు ఆర్థిక సాయం చేశాను. ఈ విషయం గురించి మఠాధిపతులు, పీఠాధిపతులను అడితే తెలుస్తుంది.'' అని వైసీపీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి అన్నారు.

వైసీపీ నేత రజాక్ సైతం రాజాసింగ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. శ్రీశైల మల్లిఖార్జునస్వామిని ఏ మతం వారైనా పూజించవచ్చని అన్నారు. ఇతర మతస్తులు మల్లిఖార్జునస్వామిని పూజించకూడదని మీ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. శ్రీశైలం దేవస్థానంలో తన పేరు మీద ఎవరికీ కాంట్రాక్ట్‌లు ఇప్పించలేదని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories