Andhra Pradesh: హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న పోలీసులు... కేసు నమోదు

Krishna District Police Filed Cases on Cops Who are not Wearing Helmet
x

Krishna District Police Filed Cases on Cops 

Highlights

Andhra Pradesh: హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులుపై కేసులు నమోదు చేశారు కృష్ణా జిల్లా ట్రాఫిక్ డిఎస్పి

Andhra Pradesh: ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తుండగా జరుగుతున్నాయని.. ఎక్కవ మంది ప్రాణాలు కోల్పోడానికి కూడా కారణం అదే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గుర్తించారు. దీంతో హెల్మెట్ పెట్టకోకుండా ఎవరూ కనబడినా కేసులు నమోదు చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, హెల్మెట్ ర్యాలీలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అంతేకాదు హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. దీంతో తాజాగా ట్రాఫిక్ డిఎస్పి పి. భరత్ మాతాజీ ఆధ్వర్యంలో బందరు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, మొత్తం 127 నో హెల్మెట్ కేసులు నమోదు చేశారు.

అందులో 27 కేసులు పోలీసులుపై నమోదు చేయడం గమనార్హం. చట్టం ముందు అందరూ సమానమే అని, అది అందరికీ వర్తిస్తుందని కనుక రోడ్డు మీదకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని ట్రాఫిక్ డిఎస్పి భరత్ మాతాజీ చెప్పారు. అనుకోని విధంగా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ అనేది సంజీవనిలా ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories