Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil Alwar Tirumanjanam Held at Tirumala Temple
x

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Highlights

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాని టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించారు.

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాని టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించారు. ఆణివార ఆస్థానం సందర్భంగా..ఆలయ శుద్ధి కార్యక్రమాని అర్చకులు, అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో జే. శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు.

కాగా, స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories