వర్ల రామయ్య, కొడాలి నాని.. మధ్యలో జూ.ఎన్టీఆర్‌పై రచ్చ ఏంటి?

Varla Ramaiah vs Kodali Nani
x

వర్ల రామయ్య, కొడాలి నాని.. మధ్యలో జూ.ఎన్టీఆర్‌పై రచ్చ ఏంటి?

Highlights

Varla Ramaiah: అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరిగిందంటూ, సానుభూతి అస్త్రాన్ని పదేపదే ఇంకా ఇంకా వదులుతోంది తెలుగుదేశం.

Varla Ramaiah: అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరిగిందంటూ, సానుభూతి అస్త్రాన్ని పదేపదే ఇంకా ఇంకా వదులుతోంది తెలుగుదేశం. ఏకంగా ఆ పార్టీ నేతలు దీక్షకు సైతం కూర్చున్నారు. అయితే, మధ్యలో జూనియర్‌ ఎన్టీఆర్‌పై అదే తెలుగుదేశం నేతలు, కొత్త ఆయుధం ప్రయోగించడం మాత్రం, భలే మ్యాజిక్‌లా వుందన్న సౌండ్‌ రీసౌండ్‌ నిస్తోంది. టార్గెట్‌ కొడాలి నాని, వంశీ, వయా తారక్‌ ఇదే మున్ముందు బీభత్సంగా ప్రయోగించాలని డిసైడయ్యిందట టీడీపీలోని ఓ వర్గం. అయితే, కొడాలి నాని, నాలుగాకులు ఎక్కువు చదివాడు తనపై వదిలిన జూనియర్ ఎన్టీఆర్ అస్త్రాన్ని, తిప్పికొట్టారు. తారక్‌తో తనకు గొడవలున్నాయి అతనేంటి తనను కంట్రోల్ చేసేదంటూ, తారక్‌పై రుసరుసలాడినట్టు మాట్లాడారు. నిజంగా తారక్‌తో కొడాలి, వంశీలకు గొడవలున్నాయా? నాని ఎందుకలా అన్నారు?

జూనియర్‌ ఎన్టీఆర్‌ కేంద్రంగా రాజకీయం రంజుగా మారుతోంది. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు దుర్భాషలు మాట్లాడారంటూ సాగిన రచ్చ, మరింత కంటిన్యూ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుపై ఈ విషయాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ నేత వర్లరామయ్య ఏకంగా దీక్ష చేపట్టారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ దీక్షకు కూర్చున్నారు. ఇదే సందర్బంలో జూనియర్‌ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. అటు జూనియర్‌ ఎన్టీఆర్‌పై మంత్రి కొడాలి నాని కామెంట్స్‌పైనా హాట్‌హాట్‌ డిస్కషన్‌ సాగుతోంది.

భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీఆర్‌ స్పందించిన తీరు సరిగా లేదన్నారు వర్ల రామయ్య. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని, రాష్ట్రం మొత్తం అనుకుంటోందన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అంటూ ప్రశ్నించారు వర్ల రామయ్య. అక్కడితో ఆగలేదు వర్లరామయ్య. కొడాలినాని, వల్లభనేని వంశీలతో ఎంతో అనుబంధమున్న జూనియర్ ఎన్టీఆర్, ఎందుకు వారిని కంట్రోల్‌ చెయ్యడం లేదన్నారు.

వర్ల రామయ్య కామెంట్లపై స్పందించారు కొడాలి నాని. వల్లభనేని వంశీ సైతం పక్కనే వున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌, తమను కంట్రోల్ చెయ్యాలంటూ వర్ల రామయ్య అనడంపై రియాక్ట్ అయిన నాని, ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేయడమేంటని ప్రశ్నించారు. ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీతో తమకు అనుబంధముందని, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి సినిమాలు చేశామని, కానీ కొన్ని విభేదాలతో, ఎవరికి వారే అన్నట్టుగా వున్నామన్నారు నాని. ఎన్టీఆర్ చెప్పినట్టు తామెందుకు వింటామన్నారు నాని.

కొడాలి నాని, వంశీలు, జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌కు ఎంతో సన్నిహితులు. ఎన్టీఆర్‌తో సినిమాలు సైతం నిర్మించారు. దివంగత హరికృష్ణతోనూ నానికి మంచి సంబంధాలే వుండేవి. కొడాలి నాని తనకు అత్యంత ఆత్మీయుడని తారక్‌ సైతం ఎన్నోసార్లు అన్నారు. కొడాలి నాని టీడీపీలో వున్నప్పుడు, వైసీపీలో చేరిన తర్వాత కూడా, ఇరువురి నడుమ రిలేషన్‌ కంటిన్యూ అయ్యింది. నాని వైసీపీలో చేరిన తర్వాత, చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలతో నిత్యం చెలరేగిపోయారు. టీడీపీలో హరికృష్ణను, జూనియర్‌ ఎన్టీఆర్‌ను రాజకీయంగా అణచివేసేందుకు, చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారని చాలాసార్లు చెప్పారు నాని. తన కొడుకు లోకేష్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు, జూనియర్‌ను కావాలనే పక్కనపెట్టారని విమర్శించారు. మహానాడులో జూనియర్ ఫోటో లేకుండా లోకేష్‌ ఫోటోలు విస్తారంగా పెట్టడంపై, నాడు హరికృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన చివరి దినాల్లోనూ చంద్రబాబుపై రగిలిపోయారట హరికృష్ణ. జూనియర్ ఎన్టీఆర్‌ కూడా, బాబుపై ఇలాంటి ఆగ్రహంతోనే వున్నారట. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబుపై కోపంతోనే, టీడీపీకి దూరమయ్యారు ఎన్టీఆర్‌. చంద్రబాబే ఉమ్మడి బద్దవ్యతిరేకి కావడంతో, సహజంగానే, వంశీ, నాని, ఎన్టీఆర్‌‌‌ల మధ్య బంధం అలాగే వుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ ఫ్రెండ్‌షిప్‌ వల్లే, చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని నాని, వంశీలు తిడుతున్నా, జూనియర్ ఎన్టీఆర్‌ కనీసం ఒక్క మాటా అనడం లేదని ప్రచారం చేస్తోంది టీడీపీ.

జూనియర్ ఎన్టీఆర్‌ మొన్న రిలీజ్ చేసిన వీడియోను అత్యంత వ్యూహాత్మకంగా ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా జూనియర్‌ను, కొడాలి నాని, వంశీని ప్రజాక్షేత్రంలతో విలన్‌గా చూపేందుకు ట్రై చేస్తోంది. అందులో భాగంగానే వర్లరామయ్య కామెంట్స్‌ చూడాల్సి వుందంటున్నారు విశ్లేషకులు. వంశీ, నాని మాటలకు, జూనియర్‌కూ సంబంధముందనే అపవాదును జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆ విధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను జనంలో పలుచన చెయ్యాలని, ముఖ్యంగా పెద్ద ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను, సామాజికవర్గాన్ని దూరం చెయ్యాలన్న స్ట్రాటజీ వేస్తోంది.

ఇలా జనంలో చర్చనీయాంశం చేస్తే, ఫ్యూచర్‌లో లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ పోటీ కాకుండా, కొంతయినా డ్యామేజ్ చెయ్యొచ్చన్నది చంద్రబాబు వర్గం ఆలోచనగా కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పదేపదే ఇదే అంశం ప్రస్తావించడం ద్వారా, అటు జనంలో సానుభూతి, ఇటు తారక్‌, నాని, వంశీలపై వ్యతిరేకత భావం పెరుగుతుందన్నది టీడీపీలో ఒక వర్గం ఆలోచనగా కొందరు అభివర్ణిస్తున్నారు. వీరి స్ట్రాటజీకి కౌంటర్‌ అన్నట్టుగా, జూనియర్‌ ఎన్టీఆర్‌తో తమకేం సంబంధం అంటూ కొడాలినాని కామెంట్స్ చెయ్యడం, ఇప్పుడు మరో సంచలనం.

తారక్‌ తమను కంట్రోల్ చెయ్యడమేంటని రివర్స్ క్వశ్చన్ చేశారు నాని. తారక్‌తో తమకు ఎప్పుడో విభేదాలు మొదలయ్యాయని, ఎలాంటి అనుబంధాలూ లేవని, ఒకరకంగా తారక్‌ను సైడ్‌ చేసి, టీడీపీ స్ట్రాటజీలను తిప్పికొట్టారు నాని. వైసీపీని చూపి, తారక్‌‌ను చక్రబంధంలో ఇరికించాలని వర్లరామయ్య సహా టీడీపీలో ఒకవర్గం గట్టిగా ప్రయత్నిస్తున్న టైంలో, కొడాలి నాని కామెంట్లతో, వారి వ్యూహానికి గండిపడినట్టయ్యిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories