Anakapalle: అనకాపల్లిలో హడలెత్తించిన కింగ్ కోబ్రా

King Cobra In Anakapalle
x

Anakapalle: అనకాపల్లిలో హడలెత్తించిన కింగ్ కోబ్రా

Highlights

Anakapalle: 13 కేజీల బరువు ఉన్న గిరినాగు

Anakapalle: అనకాపల్లి జిల్లాలో 18 అడుగుల గిరినాగు కలకలం రేపింది. దేవరాపల్లి ముకుందపురంలో పొలానికి వెళ్లిన గ్రామస్థులకు గిరినాగు కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు, వెంటనే వన్యప్రాణుల సంరక్షణ టీమ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది చాకచక్యంగా ఈ 13 కేజీల బరువున్నా గిరినాగును పట్టుకున్నారు. పట్టుకునే సమయంలో పాము పడగ విప్పి కాసేపు బుసలు కొట్టడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఈ గిరి నాగులు కేర‌ళ‌, ఆ స‌మీప ప్రాంతాల్లో ఎక్కువ సంచ‌రిస్తుంటాయి. ఇవి అధికంగా దట్టమైన ఆడవుల్లో మాత్రమే ఉంటాయి.. జనావాసాల్లోకి రావడం చాలా అరుదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో దర్శనమిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories