Chandrababu: చంద్రబాబు హౌస్‌ రిమాండ్ పిటిషన్‌పై వాదనలో కీలక అంశాలు

Key Points In The Argument On The Chandrababu House Remand Petition
x

Chandrababu: చంద్రబాబు హౌస్‌ రిమాండ్ పిటిషన్‌పై వాదనలో కీలక అంశాలు

Highlights

Chandrababu: ఆరోగ్యంగానూ ఉన్నారన్న ఏఏజీ పొన్నవోలు

Chandrababu: చంద్రబాబు హౌస్‌ రిమాండ్ పిటిషన్‌పై జరిగిన వాదనలో కీలక అంశాలను న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వాలని సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు విన్పించారు. సెక్షన్ 167(2) కింద రెండు కస్టడీలు మాత్రమే ఉంటాయని సీఐడీ త‌ర‌పు న్యాయ‌వాదులు వాదించారు. జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ మాత్రమే ఉన్నాయంటున్న ఏఏజీ.. నవలఖా తీర్పును పరిగణనలోకి తీసుకోవాలంటూ లూథ్రా వాదనలు విన్పించగా... న‌వ‌ల‌ఖా తీర్పునకు.. ఈ కేసుకు సంబంధం లేద‌న్నారు ఏఏజీ సుధాక‌ర్‌రెడ్డి.

అయితే కొన్నేళ్లు జైల్లో ఉండి ఆరోగ్యం క్షీణించిన వారికి మాత్రమే.. హౌస్ కస్టడీ ఇస్తారని వాదించారు. హౌస్ ప్రొటెక్షన్ అనేది సీఆర్‌పీసీలో ఎక్కడా లేదన్న ఏఏజీ.. చంద్రబాబుకు కావాల్సినంత భద్రత పెట్టామని.. ఆరోగ్యంగానూ ఉన్నారని ఏఏజీ పొన్నవోలు కోర్టు దృష్టికి తెచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories