S Jagan: ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
YS Jagan: ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జడ్జి నాట్ బి ఫోర్ మీ అనడంతో ఈ పిటిషన్ పై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. 2024, డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.
ఈ పిటిషన్ పై విచారణను గతంలో కూడా నాట్ బి ఫోర్ మీ అని సంజయ్ కుమార్ చెప్పారు. ఇవాళ ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ కూడా సభ్యులు. విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందని జగన్ తరపు న్యాయవాది బెంచీ దృష్టికి తెచ్చారు. దీంతో జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బి ఫోర్ మీ అన్నారు. పొరపాటున ఈ పిటిషన్ సంజయ్ కుమార్ ఉన్న బెంచీ వద్దకు వచ్చిందని సీజేఐ ఖన్నా చెప్పారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరపనుందని సీజేఐ ఖన్నా ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
రఘురామకృష్ణంరాజు పిటిషన్ ఏంటి?
హైద్రాబాద్ లోని సీబీఐ ప్రత్యేక ధర్మాసనం జగన్ ఆస్తుల కేసును విచారిస్తోంది. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వేర్వేరు పిటిషన్లను ఆయన దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ, జడ్జి నాట్ బి ఫోర్ మీ అనడంతో విచారణ వాయిదా పడింది.
సమయం కోరిన సీబీఐ
జగన్ తరపు న్యాయవాది వాదనల తర్వాత సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని కోరారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire