Viveka Murder Case: సీబీఐ దూకుడు.. ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్ట్

Key Development In YS Viveka Murder Case
x

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం

Highlights

Viveka Murder Case: భాస్కర్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలిస్తున్న సీబీఐ బృందం

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. భాస్కర్‌రెడ్డిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారం తెలిపారు. భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో సీబీఐ వాహనాలను అవినాష్‌ అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. పులివెందులలోని వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసాలకు సీబీఐ అధికారులు వెళ్లారు. రెండు వాహనాల్లో వారు పులివెందుల చేరుకున్నారు. ప్రస్తుతం అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. అవినాష్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకే సీబీఐ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది.

పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్ రెడ్డి.. ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు కడపకు చేరుకోనున్నారు. దీంతో సీబీఐ అధికారులు ఆయన ఇంటికి చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది. అయితే హైదరాబాద్‌లోని అవినాష్ రెడ్డి నివాసానికి కూడా మరో సీబీఐ బృందం చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories