AP News: ఏపీ కేబినెట్ భేటీ‌లో కీలక నిర్ణయాలు

Key decisions in AP Cabinet meeting
x

AP News: ఏపీ కేబినెట్ భేటీ‌లో కీలక నిర్ణయాలు 

Highlights

AP News: సర్వే రాళ్లపై జగన్ ఫొటో, పేరును.. తొలగించడానికి ఏపీ కేబినెట్ ఆమోదం

AP News: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. మాజీ సీఎం జగన్‌ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్లను ఏం చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. సర్వే రాళ్లపై ఆయన బొమ్మతో పాటు పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారు. దీంతో సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటితో పాటు.. జగన్‌ ఫొటో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో.. రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జగన్‌ బొమ్మ ఉన్న పుస్తకాలను వెనక్కి తీసుకోనుంది.

స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే అవకాశముంది. దీనిపై భేటీలో చర్చిస్తున్నారు. వైకాపా హయాంలో ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అవకతవకలు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై చర్చ జరుగుతోంది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్‌లో తీర్మానం చేసే అవకాశముంది.

మరోవైపు భూముల రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూ శాఖ నోట్‌ సమర్పించింది. సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై సమావేశంలో చర్చ జరిగింది. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల్లో ఆందోళన ఉందని పలువురు మంత్రులు అన్నారు. భూయజమానుల్లో ఆందోళనతో గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో రీ సర్వే ప్రక్రియను అబేయెన్స్‌లో పెట్టాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories