ఫలించిన మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత రాయబారం

ఫలించిన మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత రాయబారం
x

ఫలించిన మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత రాయబారం

Highlights

చంద్రబాబు రంగంలోకి దిగడంతో బెజవాడ టీడీపీలో విభేదాలకు ఫుల్‌స్టాప్ పడింది. స్వయంగా విజయవాడ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత రాయబారం చేయడంతో ఈ మొత్తం...

చంద్రబాబు రంగంలోకి దిగడంతో బెజవాడ టీడీపీలో విభేదాలకు ఫుల్‌స్టాప్ పడింది. స్వయంగా విజయవాడ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత రాయబారం చేయడంతో ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. బోండా ఉమ ఇంటికి వెళ్లిన శ్వేత తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా బొండా, బుద్ధా, నాగూల్ మీరాను కోరారు. దీంతో రేపు శ్వేతతో కలిసి ప్రచారం నిర్వహించిందేందుకు బోండా ఉమ, బుద్ధా, నాగూల్ మీరా ఓకే చెప్పారు.

మరోవైపు విజయవాడ నాయకులలో సమన్వయలోపం కారణంగానే విభేదాలు వచ్చాయన్నారు విజయవాడ టీడీపీ ఇంఛార్జ్ నెట్టెం రఘురాం. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రేపు శ్వేతతో ఎన్నికల ప్రచారంలో తామంతా కలిసి పాల్గొననున్నట్లు బోండా ఉమ స్పష్టం చేశారు. మేయర్ అభ్యర్థి శ్వేత గెలుపు కోసం అందరం కృషి చేస్తామన్నారు. బుద్ధా వెంకన్న కూడా విభేదాలపై స్పందించారు. అచ్చెన్నాయుడితో తమ అభిప్రాయాలు చెప్పామన్నారు. శ్వేతకు తాము వ్యతిరేకం కాదన్న బుద్ధా కొన్ని పరిణామాల కారణంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారంపై కేశినేని శ్వేత స్పందించారు. టీడీపీలో మేమంతా ఒక్కటే అన్న శ్వేత.. ఏ కుటుంబంలోనైనా చిన్న చిన్న తగాదాలు ఉంటాయన్నారు. 2013 నుంచి టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తున్నా అన్న శ్వేత విజయవాడ అభివృద్ధికి వివాదాలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని ముందుకు వెళతానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories