సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కరణం

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కరణం
x
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంటిమీద కునుకు లేకుండా పోతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ప్రధానంగా అధికార వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి టాటా చెప్పి వైసీపీ చేరుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సినీయర్ నేత కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్‌ సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. కరణం వెంకటేశ్‌తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో కరణం వెంకటేశ్‌ గెలిపిస్తామని స్పష్టం చేశారు. జగన్‌ పాలనపై అన్ని వర్గాల ప్రజల సంతృప్తిగా ఉన్నాయని చెప్పారు. చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories