శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా కనుమ పండుగ.. పశువులకు పూజలు చేసిన రైతులు

Kanuma Festival is Celebrated in Srikakulam District
x

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా కనుమ పండుగ.. పశువులకు పూజలు చేసిన రైతులు 

Highlights

Srikakulam: పక్షుల కోసం గుమ్మానికి ధాన్యపు కంకులు

Srikakulam: సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు. దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకంగా ఉండే ముగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు.

సంసృతికి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే జిల్లా సిక్కొలు జిల్లా. ఇక్కడ రైతులు కనుమ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అలనాటి సంప్రదాయాలను నేటి తరం మరిచిపోకుండా ఉండటం కోసమే ఈ పండగ చేస్తున్నట్టు రైతన్నలు చెబుతున్నారు. తెల్లవారుఝామునే లేచి ఆవులకు, ఎద్దులకు కాళ్లను కడిగి పశుపు రాసి, బొట్టుపెడతారు మహిళలు. అలాగే రైతన్న ఎద్దులకు పసుపు పూసి నాగళి, కావిడి పెట్టి ఆ ఎద్దులకు కూడా పూజ చేస్తారు. మహిళలు ఆవులు, ఎద్దుల చుట్టూ తిరిగి తమను కాపాడామని వాటిని వేడుకుంటారు. ధాన్యం, బియ్యం, వాటికి తినిపిస్తారు. అలాగే వాటికి ప్రత్యేక కుడితిని ఈ రోజు పెడతారు.

కొందరు మహిళలు రైతులను ఉద్దేశించి పాటలు పాడి మీతో మేము ఉన్నామని వారికి భరోసా ఇస్తారు. కనుమపండుగ ప్రకృతి పండగని రైతులంటున్నారు. తమకు పశువులంటే ప్రాణమంటున్నారు. మహిళలు మాట్లాడుతూ తమకు వ్యవసాయమే తప్ప మరొకటి తెలియదంటున్నారు. రాను రాను సనాతన సంప్రదాయాలను మరచి పోతున్నా.వ్యవసాయం యాత్రీకరణ అయినా ప్రకృతి పండగ అయిన కనుమను ఘనంగా జరపడం మంచి పరిణామమని జిల్లావాసులు కొనియాడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories