సంబరంగా కనుమ పండగ.. మటన్ కు డిమాండ్!

Kanuma Festival speciality
x

కనుమ పండగ (ప్రతీకాత్మక చిత్రం)

Highlights

* చికెన్, మటన్ షాపుల దగ్గర రద్దీ * నాటు కోడి, మటన్ కు భారీ డిమాండ్

తెలుగు ప్రజలు కనుమ పండుగను జరుపుకుంటున్నారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు.. ముక్క లేనిదే ముద్దదిగదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. నాటు కోడితో పాటు మటన్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఏటా సంకాంత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజైన కనుమ రోజున నాన్ వెజ్ తినడం అనవాయితీ. ఈ ఏడాది కూడా నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు.

కనుమ రోజు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు.. అందులోకి నాటుకోడితోపాటు వివిధ రకాల మాంసాహారాలు తీసుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజులూ మూడు ప్రత్యేకతలు సంతరించుకుంది. తొలిరోజు భోగి మంటలు వేసి పిండి వంటలు చేసుకుని పిల్లలు ఆనందంగా గడుపుతారు. రెండో రోజున తమ పూర్వీకులకు పితృతర్పణాలు ఇచ్చే కార్యక్రమాలు పెద్దలు పెట్టుకుంటారు. మూడో రోజు పూర్తిగా మాంసాహారం సంక్రాంతిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో బాగంగా ఇవాళ కనుమ కావడంతో ప్రజలు మాంసాహారం షాపుల ముందు క్యూకట్టారు.

కనుమ పండగ రోజు తప్పనిసరిగా నాన్ వెజ్ వండుకుంటారు తెలుగు ప్రజలు. సాధారణంగా కోడికూరకే పెద్ద పీట వేస్తారు. అయితే, ఈ ఏడాది బర్డ్ ఫ్లూ టెన్షన్ పుట్టిస్తోంది. కోళ్లు, కోడి గుడ్డు ద్వారా కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుందని పుకార్లు రావడంతో... నాన్ వెజ్ ప్రియులు కోడి కంటే మటన్, చేపల వైపు మొగ్గచూపుతున్నారు. మటన్ ధర ఎక్కువయినా సరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories