Kalyanapu Lova Reservoir : కష్టాల సుడిలో.. కల్యాణపు లోవ !

Kalyanapu Lova Reservoir : కష్టాల సుడిలో.. కల్యాణపు లోవ !
x
Highlights

Kalyanapu Lova Reservoir : వందలాది కుటుంబాల నోట్లో అక్రమార్కులు మట్టికొడుతున్నారు. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఉన్న కల్యాణపులోవ రిజర్వాయర్‌ను ఆనుకుని అటు,...

Kalyanapu Lova Reservoir : వందలాది కుటుంబాల నోట్లో అక్రమార్కులు మట్టికొడుతున్నారు. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఉన్న కల్యాణపులోవ రిజర్వాయర్‌ను ఆనుకుని అటు, ఇటు చివరలో ఎన్నో కొండలున్నాయి. ఆ కొండల్లో తవ్వకాల కోసం గత ప్రభుత్వం 8 వైట్ గ్రానైట్ మైనింగ్ కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం రెండు కంపెనీలు ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించగా, మరో కంపెనీ మూతబడింది. కొత్తగా ఒక కంపెనీ మైనింగ్ అనుమతులు సాధించింది. అయితే కల్యాణపులోవ రిజర్వాయర్‌ పరిసరాల్లో జరుగుతున్న తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. రిజర్వాయర్‌కు పొంచివున్న ముప్పును పసిగట్టి ప్రభుత్వాలకు తమ ఆవేదన విన్నవిస్తున్నాయి. అయినా ఎక్కడి నుంచి ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఆదివాసీల రోదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది కల్యాణలోవ కష్టాలు ఏంటి.. గిరిజనుల ఆవేదన ఏంటి?

విశా‌ఖ ఏజెన్సీ అంటే సహజవనరులకు పుట్టినిల్లు. కానీ మైనింగ్ ముప్పుతో సహజవనరులు పూర్తిగా ఉనికిని కోల్పోతున్నాయి. కల్యాణలోవ రిజర్వాయర్ మైనింగ్ అక్రమార్కుల చేతిలో చిక్కి బక్కచిక్కిపోతుంది. దీంతో మైనింగ్ మాఫియా నుంచి తమ నీరుని, భూమిని, వనరులను కాపాడుకునేందుకు గిరిజనులు పోరాట బాట పట్టారు.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Show Full Article
Print Article
Next Story
More Stories