Chandrababu: చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు.. ఊరట లభించేనా..?

Judgment On Chandrababu House Remand Petition Today
x

Chandrababu: చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు.. ఊరట లభించేనా..?

Highlights

Chandrababu: సుప్రీంకోర్టు కేసులను ఉదహరించిన సిద్ధార్థ్‌ లూథ్రా

Chandrababu: స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. జైలు రిమాండ్‌ను హౌస్‌ అరెస్టుకు మార్చాలని దాఖలైన పిటిషన్‌పై నిన్న ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని, అందుకే హౌస్ రిమాండ్ కు మార్చాలని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.

చంద్రబాబుకు జైలు నుంచి హౌస్ రిమాండ్ కల్పించాలనే పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లుత్రా వాదనలు వినిపించారు. జైలులో ఆయనకు ప్రాణహాని ఉందని అందుకోసమే వెసులుబాటు కల్పించాలని కోర్టును కోరారు. NSG సెక్యూరిటీ ఉందనే హౌస్‌ అరెస్ట్ అడుగుతున్నామని లూథ్రా తెలిపారు. సుప్రీంకోర్టు పలువురు నిందితులకు ఇచ్చిన హౌస్ రిమాండ్‌ను ఉదాహరణగా వివరించారు. గతంలో చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరో వైపు సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై కోర్టుకు వివరిస్తూ ఆయనకు ప్రాణహాని లేదన్నారు. హౌస్‌ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ నొక్కి చెప్పింది. ఇంటికంటే జైలే సేఫ్టీ అని సీఐడీ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. చంద్రబాబు బయటకు వెళ్తే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని సీఐడీ వాదించింది. మరో వైపు పోలీస్ కస్టడీ పిటిషన్‌పై కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబును 15 రోజుల పోలీసు కస్టడీకి కోరినట్లు ఏఏజీ పొన్నవోలు తెలిపారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు తరపు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై ఆసక్తి నెలకొంది. అసలు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుగుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories