Chandrababu: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Judgment On Chandrababu CID Custody Petition Today
x

Chandrababu: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Highlights

Chandrababu: ఉ.11.30 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏసీబీ కోర్టు

Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు నేడు వెల్లడించనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్లపై సుమారు మూడు గంటలకు పైగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈరోజు ఉదయం 11గంటల30 నిమిషాలకు తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఏం తీర్పు ఇవ్వనున్నారనే ఉత్కంఠ నెలకొంది.

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు అని సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు వాదించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టులో వాదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. స్కిల్ డెవలఫ్‌మెంట్‌లో స్కామ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతి చేసినటల్లు ఆధారాలు లేవు అని చెప్పుకొచ్చారు. అరెస్టు ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అని వాదించారు.

చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబరు 11న కస్టడీకి కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారు. కొన్ని గంటలపాటు చంద్రబాబును విచారించారు. ఆయన్నుంచి అన్ని విషయాలు రాబట్టామని చెప్పి, మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. మరి నేడు కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories