Chandrababu: అరెస్టుపై స్పందించని హరికృష్ణ ఫ్యామిలీ.. జూనియర్‌ నిరాసక్తత.. తమ్ముడి బాటలో కళ్యాణ్‌ రామ్..

Jr NTR and Kalyan Ram Silence on Chandrababu Arrest
x

Chandrababu: అరెస్టుపై స్పందించని హరికృష్ణ ఫ్యామిలీ.. ఆ మౌనం వెనుక... ఏం దాగి ఉంది...?

Highlights

Chandrababu Arrest: ఆ మౌనం వెనుక... ఏం దాగి ఉంది...? రాజకీయాలకు దూరంగా ఉండాలనే అంశం కనిపిస్తోందా..?

Chandrababu Arrest: ఆ మౌనం వెనుక... ఏం దాగి ఉంది...? రాజకీయాలకు దూరంగా ఉండాలనే అంశం కనిపిస్తోందా..? టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌.. రాజమండ్రి జైలుకు తరలింపుపై ఓవైపు ఏపీ అట్టుకుడుతోంది. మరో వైపు దివంగత ఎన్టీఆర్‌ కుటుంబం నిరసన వ్యక్తం చేసింది.. కానీ నందమూరి హరికృష్ణ కుటుంబం మాత్రం స్పందించడం లేదు... ఎందుకు..? ఇది చంద్రబాబునాయుడి అభిమానులు, టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడని అంశం. తెలుగు అగ్ర హీరోల్లో ఒకరిగా నిలుస్తూ, మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌... కూడా తన మేనత్త కుటుంబానికి అండగా మాట్లాడకపోవడంపై ఆ పార్టీలో ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

గతంలో చంద్రబాబు ఇంటి స్త్రీలను అవమానించిన ఘటనలో ఆడవాళ్లను కించపరచకూడదని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ జనరల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకానీ చంద్రబాబు కుటుంబానికి మద్దతు తెలుపలేదు. చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకున్న తర్వాత... మొదటిసారిగా ఇప్పుడు అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జూనియర్‌ తనకేమీ పట్టనట్లు వ్యవహరిన్నారు. హరికృష్ణ రెండో కొడుకు కళ్యాణ్‌రామ్‌ కూడా చంద్రబాబు అరెస్ట్‌.. తదనంతర పరిణామాలపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దీని వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. బాబు అరెస్టును బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి కూడా ఖండించారు. కానీ అరెస్టుపై హరికృష్ణ ఫ్యామిలీ మాత్రమే ఇంతవరకు స్పందించలేదు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో నందమూరి కుటుంబం నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. సక్సెస్‌ఫుల్‌ హీరోగా తనను తాను రుజువు చేసుకున్న తర్వాత ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా గుర్తించడం ప్రారంభించాయి నారా వారి.., నందమూరి కుటుంబాలు.... 2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నిలువరించడానికి చంద్రబాబు జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకున్నారు. కాంగ్రెస్‌కు ధీటుగా యంగ్‌ టైగర్‌ ప్రచారం చేశారు. ఆయన వాగ్ధాటి, ఛరిష్మా టీడీపీకి ఓ స్టార్‌ క్యాంపెయినర్‌ను అందించాయి. తాతకు తగ్గ వారసుడని జనం కూడా అనుకున్నారు. అయినా వైఎస్‌ మళ్లీ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల తర్వాత చంద్రబాబు, జూనియర్‌ ఎన్టీయార్‌ మధ్య గ్యాప్‌ వచ్చింది.

2014లో చంద్రబాబు మళ్లీ అధికారాన్ని సాధించారు. ఈ దఫా తన వారసుడిగా లోకేష్‌ను ప్రమోట్‌ చేశారు. హరికృష్ణ ఫ్యామిలీ పూర్తిగా సైడ్‌లైన్‌ అయిపోయింది. 1995 ఆగస్టు సంక్షోభంలో హరికృష్ణ చంద్రబాబును పూర్తిగా సపోర్ట్‌ చేశారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు లభించడానికి ఇది కూడా ఓ కారణం. తాను ముఖ్యమంత్రి అయ్యాక బావమరిదికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. పార్టీలో తన స్థానం సుస్థిరం అయ్యాక హరికృష్ణ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది, మరో బావమరిది బాలకృష్ణ... చంద్రబాబు వియ్యంకుడు అయ్యాక, నారా కుటుంబానికి హరికృష్ణ అవసరం లేకుండాపోయింది.

ఈ పరిణామాలన్నీ హరికృష్ణ కుటుంబానికి కోపం తెప్పించాయని తెలుస్తోంది. తన తండ్రికీ, తనకూ కుటుంబంలో సీనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబంలో ప్రాధాన్యం తగ్గడంపై జూనియర్‌లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందని తెలుస్తోంది. అందుకే నారా కుటుంబానికి కూడా ఆయన దూరం జరిగారు. కళ్యాణ్‌ రామ్‌ కూడా తమ్ముడి బాటలోనే వెళ్తున్నారు. తమ పర్యటనల్లో జూనియర్‌ అభిమానులు ఎన్టీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయడంపై గతంలో చంద్రబాబు, లోకేష్‌ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్‌కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలుస్తున్నప్పుడు, కాబోయే సీఎం అంటూ.... నందమూరి అభిమానులు జూనియర్‌ను సంబోధించినప్పుడు ఎన్టీఆర్‌ కూడా స్పందించడం లేదు.

కొన్నిసార్లు జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వివాదాలకు దారితీశాయి. అందుకే జూనియర్ స్పందించడం లేదా..? అని... జూనియర్ స్పందించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా యంగ్ టైగర్ టీడీపీకి దూరంగా ఉంటున్నారెందుకో.. తెలియడం లేదని అభిమానులే అంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా ఎదిగిన జూనియర్‌.. మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో నటించబోతున్నందున బిజీగా ఉండడంతో స్పందించడం లేదా..? దేవర సినిమాతో బిజీగా ఉన్నందున జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదా అంతుచిక్కని అంశమే.

అయితే జూనయిర్ రాజకీయాల్లోకి రావాలని అనుకోవట్లేదని ఓ వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడం పక్కన బెడితే.. బంధుత్వంతోనైనా స్పందించాలి.. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. రాజకీయ వివాదాలు ఎందుకని జూనియర్ అనుకుంటున్నారా..? లేక చంద్రబాబు తన తాతకు చేసిన ద్రోహాన్ని మరిచిపోలేకపోతున్నారా..? తేలాల్సి ఉంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories