Pawan Kalyan Response on Shipyard Incident: విశాఖ షిప్ యార్డ్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Response on Shipyard Incident: విశాఖ షిప్ యార్డ్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్
x
Pawan Kalyan (File Photo)
Highlights

Pawan Kalyan Response on Shipyard Incident: విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆకడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Pawan Kalyan Response on Shipyard Incident: విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆకడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మృతుల సంఖ్య 11కి పెరిగింది.. ఇక ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేసారు.

అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలామంది కాంట్రాక్టు కార్మికులే ఉన్నారని.. వారి కుటుంబాలను అన్ని విదాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. అంతే కాదు మృతుల కుటుంబలో ఒకరికి షిప్ యార్డ్ లో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. ఇటీవలే కాలంలో వరుస ప్రమాదాలతో విశాఖ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. మొన్న ఎల్జీ పాలిమర్స్, సాయినార్, రాంకీ సెజ్ వంటి వరుస దుర్ఘటనలు ఇంకా కళ్ళముందే మెదులుతున్నాయి. అవి మరువాక్ ముందే నేడు షిప్ యార్డ్ లో క్రేన్ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం భాదాకరం అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories