ఏపీలో దిశ యాక్ట్..చేయ్యేస్తే అంతే

ఏపీలో దిశ యాక్ట్..చేయ్యేస్తే అంతే
x
Highlights

మహిళల భద్రతకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే నిందితులకు మరణశిక్ష పడేలా 'దిశ'...

మహిళల భద్రతకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే నిందితులకు మరణశిక్ష పడేలా 'దిశ' యాక్ట్‌ పేరుతో కొత్త చట్టానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇలాంటి కేసుల్లో నిర్దిష్టమైన ఆధారాలుంటే నిందితులకు కేవలం 21 రోజుల్లోనే శిక్ష పడేలా డ్రాఫ్ట్‌ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించారు. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

మహిళల భద్రత కోసం రూపొందించిన చరిత్రాత్మక ముసాయిదా బిల్లుకు జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దిశ ఘటన నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. దానికి అనుగుణంగా గురువారం భేటీ అయిన ఏపీ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు -2019కు ఆమోదం తెలిపింది. ఇది చట్ట రూపం దాలిస్తే మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష పడుతుంది.

పక్కా ఆధారాలు ఉంటే అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేయనున్నారు. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. ఇప్పటి వరకూ ఇలాంటి కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకు ఓ కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి.

మహిళలు, చిన్నారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకురాబోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories