Andhra Pradesh: సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా జగన్‌ సర్కార్‌ అడుగులు

Jagan Government Thinks on Complete Lock Down in AP
x

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: కేసుల పెరుగుదలతో ఏపీలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి

Andhra Pradesh: ఏపీలో కరోనా విస్తృతిని అడ్డుకట్ట వేయడానికి జగన్‌ సర్కార్‌ సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతిస్తున్న కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల మాదిరి కరోనా కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం ఒక్క సారిగా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తుండటంతో.. కేసులు పెరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. ఇలాంటి టైంలో లాక్‌డౌనే బెస్ట్ అని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

కేసుల పెరుగుదలతో ఏపీలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మందుల కొరత, వాక్సిన్, బెడ్లు, ఆక్సిజన్ అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మరోవైపు ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించింది. ఐసీఎంఆర్ పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని సూచిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేట్ 20 శాతం దాటుతోంది. ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ 20 శాతానికి మించిందని నిర్ధారణవగా విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories