CM jagan: నకిలీ చలానాల స్కామ్‌తో డాక్యుమెంట్‌ రైటర్లపై జగన్ సర్కార్ ఫోకస్

Jagan Government Focuses on Document Writers With Fake Challans Scam
x

నకిలీ చలానాల స్కామ్‌తో డాక్యుమెంట్‌ రైటర్లపై జగన్ సర్కార్ ఫోకస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM jagan: డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని తెచ్చే అంశంపై కసరత్తు మొదలుపెట్టిన రిజిస్ట్రేషన్ల శాఖ

CM jagan: నకిలీ చలానాల స్కామ్‌తో డాక్యుమెంట్‌ రైటర్లపై జగన్ సర్కారు దృష్టి పెట్టింది. డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని తెచ్చే అంశంపై స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. నకిలీ చలానా స్కామ్‌లో డాక్యుమెంట్‌ రైటర్లదే కీలక పాత్ర కావడంతో లైసెన్సింగ్‌ విధానంపై దృష్టి సారించారు అధికారులు. 25 ఏళ్ల క్రితం డాక్యుమెంట్‌ రైటర్ల లైసెన్సింగ్‌ విధానాన్ని తిరిగి అమలు చేద్దామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే వారికే డాక్యుమెంట్‌ రైటర్ల లైసెన్స్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు విషయంలో జరిగిన బోగస్ చలనాల కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన సీఎం అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు అధికారులు సీఎం‌కు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్‌లకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. అనుసంధానం ద్వారా అవకతవకలకు చెక్ పెట్టవచ్చని సీఎంకు అధికారులు వివరించారు. ఇక, బోగస్ ఛలాన్లకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.

మరోవైపు.. నకిలీ చలానాల దందా గుంటూరు జిల్లాలోనూ బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా తెలుసుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్ పరిధిలో 8 డాక్యుమెంట్స్‌లో నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. సీఎఫ్‌ఎంఎస్‌లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని.. ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తేల్చారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories