పృథ్వీపైనే పోసాని ఎందుకు ఫైరయ్యారు.. పోసాని విమర్శల వెనక అసలు కథ వేరే వుందా?

పృథ్వీపైనే పోసాని ఎందుకు ఫైరయ్యారు.. పోసాని విమర్శల వెనక అసలు కథ వేరే వుందా?
x
Highlights

ఒకరు థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ. మరొకరు టాలీవుడ్‌లో రాజాధి రాజా. ఇద్దరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు హార్డ్‌కోర్‌ లీడర్స్. కానీ అమరావతి ఆందోళన వారి మధ్య...

ఒకరు థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ. మరొకరు టాలీవుడ్‌లో రాజాధి రాజా. ఇద్దరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు హార్డ్‌కోర్‌ లీడర్స్. కానీ అమరావతి ఆందోళన వారి మధ్య చిచ్చురేపింది. మాటల యుద్ధానికి దారి తీసింది. అమరావతి నిరసనల్లో పాల్గొంటున్న మహిళా రైతులపై థర్డీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన కామెంట్లపై, పోసాని కృష్ణ మురళి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఒకవైపు జగన్‌ను పొగుడుతూనే, మరోవైపు పృథ్వీలాంటి వారివల్లే, జగన్‌కు చెడ్డపేరు వస్తోందని బ్యాలెన్స్‌డ్‌‌గా పంచ్‌లు కురిపించారు. పోసాని కేవలం పృథ్వీనే ఎందుకు టార్గెట్‌ చేశారు? పృథ్వీనే లక్ష్యంగా చేసుకుని ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టారు? దీని వెనక అసలు కథ వేరే వుందన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటా కథ?

రాజధాని ఆందోళనాకారులపై చాలామంది వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. కానీ అలాంటి వ్యాఖ్యలే చేసిన పృథ్వీపైనే పోసాని ఎందుకు ఫైరయ్యారు? ఒకవైపు జగన్‌ను పొగుడుతూనే పృథ్వీనే టార్గెట్‌ చేయడంలో ఉద్దేశమేంటి? పోసాని విమర్శల వెనక అసలు కథ వేరే వుందా?

పోసాని కృష్ణమురళి రచయిత, దర్శకుడు, నటుడు. వైసీపీలో మొదటి నుంచి జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పృథ్వీరాజ్. కమెడియన్. సినిమా నేపథ్యం నుంచి వైసీపీలో చేరిన నేత. ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నడుస్తోంది. తాజాగా రాజధాని ఉద్యమం వీరిమధ్య విభేదాలకు మరింత ఆజ్యంపోసింది.

అమరావతిలో దీక్షలు, ధర్నాలకు దిగుతున్న రైతులపై పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు రచ్చరచ్చ అవుతున్నాయి. అమరావతిలో పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతోందన్నారు పృథ్వీ. వారు సాధారణ రైతులైతే ఆడి కార్లు, మహిళల చేతులకు బంగారు గాజులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారాయన. పేరుకే అది రైతుల ఉద్యమం అని, అక్కడ నడుస్తున్నది కార్పొరేట్ ఉద్యమం అన్నారు పృథ్వీ. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళా రైతులు భగ్గుమన్నారు. పృథ్వీ దిష్టిబొమ్మలను సైతం దగ్దం చేశారు. మహిళా ఆందోళనకారులను కించరిచేలా వ్యాఖ్యానించిన పృథ్వీ, వెంటనే క్షమాపణలు చెప్పి, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పృథ్వీపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

పృథ్వీ కామెంట్లపై, పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళా రైతులను కించపరిచే వ్యాఖ్యలేంటని ప్రశ్నించారు. జగన్‌ సర్కారును అప్రదిష్టపాలు చేస్తోంది పృథ్వీలాంటివారేనని విమర్శించారు పోసాని. పోసాని కృష్ణమురళి పృథ్వీనే టార్గెట్ చేసుకుని ప్రెస్‌మీట్‌ అరెంజ్ చేశారు. పృథ్వీ చేసిన కామెంట్లే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలూ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. వీరంతా అలాంటి మాటలే అన్నప్పటికీ, కేవలం పృథ్వీనే లక్ష్యంగా చేసుకుని పోసాని మాట్లాడ్డంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు జగన్‌ను పొగుడుతూనే మరోవైపు పృథ్వీపై విమర్శలదాడి చేయడంలో పోసాని లెక్కలు వేరే వున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.

పోసాని కృష్ణమురళి మొదటి నుంచీ జగన్‌కు అండగా వున్నారు. పార్టీ పెట్టిన కొత్తలోనే రోజాతో పాటు జగన్‌ వెంట నడిచింది పోసాని కృష్ణమురళే. చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరవుతూ ప్రెస్‌మీట్లు పెట్టారు, జగన్‌ను ఆకాశానికెత్తుతూ లెక్కలేనన్ని సార్లు ప్రశంసలు కురిపించారు. పాదయాత్ర టైంలోనూ జగన్‌ దగ్గరికెళ్లి మద్దతు పలికారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అసలు తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో వున్నారు పోసాని. అంతేకాదు, మొన్నమొన్న పార్టీలోకి వచ్చిన సినిమా నటులకు జగన్‌ ప్రాధాన్యత ఇవ్వడం కూడా పోసానికి నచ్చలేదట. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి విజయ్ చందర్‌‌కు ఇవ్వగా ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను చేశారు జగన్. అదే పోసానికి గిట్టడం లేదట. మొన్నమొన్న పార్టీలోకి వచ్చిన పృథ్వీకి ఎస్వీబీసీ పదవి ఇచ్చి, కనీసం తనకు ఎలాంటి నామినేటెడ్‌ పదవి ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. తాజాగా ప్రెస్‌మీట్‌లో అదే పదేపదే ప్రస్తావించారు. పృథ్వీని అదేపనిగా విమర్శించారు.

రాజధాని రైతులపై ఒకవైపు పృథ్వీని టార్గెట్ చేస్తూనే, జగన్‌‌పై ప్రశంసలు కురిపించారు పోసాని. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలికారు. కావాలనే జగన్‌పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడారు. అంటే పోసాని టార్గెట్‌ రాజధాని మార్పూ కాదు, పెయిడ్ ఆర్టిస్టులన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కాదు, కేవలం పృథ్వీ. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మహిళా రైతులను కించపరిచేలా మాట్లాడుతున్న పృథ్వీకి, వైసీపీలో ఇంత ప్రాధాన్యం ఎందుకిస్తున్నారన్నది పోసాని ఇన్నర్‌ ఫీలింగ్. అంతేకాదు, జగన్‌ పాలనపై ప్రశంసలు, మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పి, తన విధేయత చాటుకున్నారు పోసాని. చూడాలి, రానున్న కాలంలో పోసాని కృష్ణమురళిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చూపు చూస్తుందో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories