జోరుగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్స్‌.. టాస్‌కు కూడా బెట్టింగ్‌ వేస్తున్న జనాలు

జోరుగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్స్‌.. టాస్‌కు కూడా బెట్టింగ్‌ వేస్తున్న జనాలు
x
Highlights

కాయ్‌ రాజా కాయ్‌. ఆలోచిస్తే ఆశాభంగం. లక్‌ ఉంటే ఈజీగా మనీ జేబులోకి చేరుతుంది. ఒకటికి పది.. పదికి వంద. కర్నూలు జిల్లాలో ఇప్పుడు సాగుతున్న ఐపీఎల్‌ దందా ఇది. అవును.. క్రికెట్‌ బెట్టింగ్స్‌తో కొందరు ధనవంతులు అవుతుంటే.. మరికొందరు బికారీలు అవుతున్నారు.

కాయ్‌ రాజా కాయ్‌. ఆలోచిస్తే ఆశాభంగం. లక్‌ ఉంటే ఈజీగా మనీ జేబులోకి చేరుతుంది. ఒకటికి పది.. పదికి వంద. కర్నూలు జిల్లాలో ఇప్పుడు సాగుతున్న ఐపీఎల్‌ దందా ఇది. అవును.. క్రికెట్‌ బెట్టింగ్స్‌తో కొందరు ధనవంతులు అవుతుంటే.. మరికొందరు బికారీలు అవుతున్నారు. ఇక కర్నూలు జిల్లా కేంద్రంలోని నంద్యాలలో వెలుగు చూస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌పై HMTV స్పెషల్ స్టోరీ...

యువతే వారి టార్గెట్‌.. ఈజీగా డబ్బు సంపాదించాలి అనుకునే వారే వారి పెట్టుబడి. ఇదే కర్నూలు జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు కేంద్రంగా మారింది. అంతేకాదు ఇప్పుడు కోట్ల రూపాయల బెట్టింగ్‌ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. ప్రధానంగా యువత, ఉద్యోగులు.. వేలు, లక్షల రూపాయలు బెట్టింగ్స్‌లో పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

నంద్యాల కేంద్రంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల క్రికెట్ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఇతర జిల్లాలకు చెందిన వారు కూడ బెట్టింగ్‌ వేస్తుండటంతో బుకీలు హద్దు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మ్యాచ్‌కు ముందు నుంచే ఈ బెట్టింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చెప్పాలంటే మ్యాచ్‌ ముందు వేసే టాస్‌కు కూడా బెట్టింగ్‌ జరుగుతుందంటే దీని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

జిల్లా కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్‌ వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులు.. ఓ బుకీని అదుపులోకి తీసుకున్నారు. ఇక తమదైన రీతిలో విచారించిన పోలీసులు తర్వాత 18మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షల రూపాయల నగదు, 18సెల్‌ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తానికి యువత ఈజీ మనీ సంపాదించాలి అనే ఆలోచనతో లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఎవరూ బెట్టింగ్‌ జోలికి వెళ్లకూడదని.. జేబులు ఖాళీ చేసుకోవద్దంటున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories