రెండో రోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం

Indrakeeladri Dasara Celebrations Bala Tripura Sundari Alankaram Day 2
x

రెండో రోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం

Highlights

*తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బాల త్రిపుర సందర సందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మనసు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుండి పదేళ్ళ లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ్టి నుంచి రెండు టైమ్‌స్లాట్లలో దుర్గమ్మ దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories