అనంతపురం జిల్లాలో వింత పక్షి కలకలం

అనంతపురం జిల్లాలో వింత పక్షి కలకలం
x
Highlights

* పెనుకొండలో ఆకస్మాత్తుగా కిందపడ్డ వింత పక్షి * బర్డ్‌ఫ్లూ కారణంగానే కిందపడిందని అనుమానం * జనావాసాల్లో పడటంతో భయాందోళనలకు గురవుతోన్న ప్రజలు

దేశంలో వేగంగా విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండలో వింత పక్షి కలకలం రేపింది. ఇండియన్ గ్రే‌హార్న్ బిల్‌గా పిలిచే ఈ పక్షి పెనుకొండ సమీపంలో కిందపడి కనిపించింది. ఓ వైపు బర్డ్‌ఫ్లూ భయపెడుతున్నవేళ ఈ పక్షి కిందపడి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

మరోవైపు పక్షి గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పొడవాటి ముక్కుతో ఉండే ఈ పక్షి సాధారణంగా జనావాసాల్లోకి అస్సలు రాదంటున్నారు అధికారులు. పక్షిని యానిమల్ ఆస్పత్రికి తరలించిన అటవీ అధికారులు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు పడిపోయిందన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ భయం వెంటాడుతున్న వేళ అనంతపురంలో ఈ వింత పక్షి తీవ్ర కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories