మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావుకు బిగ్ షాక్

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావుకు బిగ్ షాక్
x
Highlights

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేసింది ఇండియన్ బ్యాంక్‌. తమ బ్యాంక్‌కు రావాల్సిన బకాయిలను చెల్లించకపోవటంతో అధికారులు...

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేసింది ఇండియన్ బ్యాంక్‌. తమ బ్యాంక్‌కు రావాల్సిన బకాయిలను చెల్లించకపోవటంతో అధికారులు ఆస్తుల జప్తుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గంటా శ్రీనివాస్ రావు 248 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా ఈనెల 25న ఆన్‌లైన్‌లో ఆక్షన్‌ నిర్వహించనున్నారు బ్యాంక్ అధికారులు. ఈ మేరకు ఇ–ఆక్షన్‌ సేల్‌ నోటీసును హైదరాబాద్‌లోని ఇండియన్‌ బ్యాంకు సామ్‌(SAM) బ్రాంచ్‌ జారీ చేసింది.

ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ కొన్నేళ్ల క్రితం లోన్ తీసుకుంది. దానికి సంబంధించి రూ.141.68 మేర బ్యాంకుకు బకాయి పడింది. ఆ కంపెనీకి గంటా శ్రీనివాస్ గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఐతే బకాయిలను చెల్లించాలని 2016, అక్టోబరు 4న మొదటిసారి ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు నోటీసులు పంపించింది. కానీ రుణం చెల్లించలేక ఆ కంపెనీ చేతులెత్తేసింది. ఇన్నళ్ల పాటు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి ఆ రుణం విలువ రూ.248 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రుణం కోసం కుదువ పెట్టిన ప్రత్యూష గ్రూప్‌ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది.

రుణాల చెల్లింపునకు బాధ్యులుగా గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ లిమిటెడ్‌ సంస్థలను ఇండియన్‌ బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. తాను సంస్థ డైరెక్టర్‌ పదవి నుంచి 2011 సంవత్సరంలోనే తప్పుకున్నానని, ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. వేలం వేయనున్న ఆస్తుల జాబితాలో ఆయనకు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories