Andhra Pradesh: ఏపీలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు

Increased Electricity Charges in Andhra Pradesh
x

Andhra Pradesh: ఏపీలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు

Highlights

Andhra Pradesh: కరెంట్‌ చార్జీలు పెరగడంతో ఆందోళన

Andhra Pradesh: ఏపీలో విద్యుత్‌ ఛార్జీలు పెరగడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో విజయనగరం వాసుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలను ఎట్లా కట్టాలో దేవుడా అంటూ ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్ ఛార్జీలు పెంచడంతో సామాన్య మద్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుంది. సామన్య ప్రజల్లో నిన్నటి వరకు వంద రెండోందలు వచ్చిన బిల్లులు కాస్తా నేడు ఆరు నుంచి ఏడోందల రూపాయల బిల్లులు వస్తుండటంతో వాటిని కట్టేదేలా అని ఆవేదన చెందుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు ఇప్పటికీ రెండుసార్లు పెంచడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వినూత్న రీతిలో తమ నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో మార్పు రావడం లేదని విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories