TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ప్రతిరోజూ ఇచ్చే దర్శన టికెట్లపై కీలక అప్ డేట్

Tirumala Srivari special darshan tickets released today
x

Tirumala Tickets: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల..పూర్తి వివరాలివే

Highlights

TTD Ssd Tokens: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజూ ఎస్ఎస్ డీ దర్శన టికెట్లు జారీ చేస్తోంది. భక్తులకు తిరుపతి శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ దర్శన టికెట్లను అందిస్తోంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందిలు రాకుండా ఎప్పటికప్పుడు టికెట్లపై అప్ డేట్స్ ఇస్తోంది. అప్పటి వరకు ఎన్ని టికెట్ల జారీ చేశారు..ఎన్ని టికెట్లు ఉన్నాయన్న అప్ డేట్ అందిస్తుంది. పూర్తి వివరాలను తెలుసుకుందాం.

TTD Ssd Tokens: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులకు తిరుమలకు తరలివస్తుంటారు. ప్రతిరోజూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో నిత్యం ఎస్ఎస్డీ దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజూ వేకువజామున 2గంటలకు టికెట్ల జారీ ప్రారంభం అవుతుంది. అయితే ఈ టికెట్లకు సంబంధించిన అప్ డేట్స్ టీటీడీ ఇస్తూ వస్తోంది. భక్తులకు దర్శన టికెట్లకు సంబంధించి అప్ డేట్స్ ప్రతిరోజూ తెల్లవారుజామునే టీటీడీ ట్విట్టర్ లో పోస్టు చేస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఎస్‌ఈడీ టికెట్స్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని భక్తులు పాటించాలని ఈవో జే శ్యామలరావు విజ్ఞప్తి చేశారు. భక్తులకు గంటల తరబడి అనవసరంగా వేచి ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డి టోకెన్‌లు, ఎస్‌ఈడి టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో.. వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తుందని అన్నారు.



గత కొన్ని రోజులగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోందని ఆయన చెప్పార. కానీ, ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నామని ఈవో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories