ఎంక్వైరీ టైమ్‌.. చంద్రబాబు సీఐడీ విచారణలో కీలక అప్‌డేట్‌..

Important Update in Chandrababu CID Investigation
x

ఎంక్వైరీ టైమ్‌.. చంద్రబాబు సీఐడీ విచారణలో కీలక అప్‌డేట్‌..

Highlights

Chandrababu: కుంచనపల్లి సీఐడీ ఆఫీస్‌లో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది.

Chandrababu: కుంచనపల్లి సీఐడీ ఆఫీస్‌లో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. అయితే.. విచారణకు చంద్రబాబు సహకరించడంలేదని సీఐడీ ఆరోపిస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌తో తనకు సంబంధం లేదంటున్నారు చంద్రబాబు. దీంతో.. చంద్రబాబుకు నోట్‌ ఫైళ్లను చూపించారు సీఐడీ అధికారులు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు నోట్ ఫైళ్లు ఉన్నాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్, షెల్ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన.. వాట్సాప్‌ చాట్‌ను చంద్రబాబుకు సీఐడీ అధికారులు చూపించారు. దీంతో పాటు మరో 20 ప్రశ్నలను చంద్రబాబు ముందు ఉంచారు. దీంతో కోర్టులోనే తేల్చుకుంటానని చంద్రబాబు సీఐడీ అధికారులకు చెప్పినట్టు సమాచారం. సీఐడీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేస్తున్నారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. షెల్‌ కంపెనీల్లో నిధుల మళ్లింపుపై ఆధారాలను చంద్రబాబు ముందు ఉంచారు సీఐడీ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories