Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు.. దూసుకొస్తోన్న అల్పపీడనం. ఆ జిల్లాలకు డేంజర్ సిగ్నల్

IMD Weather Update on Heavy Rainfall Expected in Andhra Pradesh and Telangana From 21st to 25th October
x

Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు.. దూసుకొస్తోన్న అల్పపీడనం. ఆ జిల్లాలకు డేంజర్ సిగ్నల్

Highlights

Andhra Pradesh and Telangana Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంపై ఒక అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా ప్రకటించింది.

21st October Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంపై ఒక అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా ప్రకటించింది. ఇది 22వ తేదీకి వాయుగుండంగా మారనున్నట్లు తెలిపింది. 23న తుఫాన్‌గా మారనుందని ప్రకటించింది. ఈ తుఫాన్ వాయవ్య దిశగా కదులుతూ.. 24 ఉదయం ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటుతుందని తెలిపింది. అలాగే, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకొని ఒక ఆవర్తనం ఉందని, దీంతో 21 నుంచి 25 వరకు కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తాజా సమాచారం మేరకు నేడు అంటే సోమవారం ఎండతోపాటు మేఘాలు కమ్ముుకుని ఉంటాయని, అలాగే అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ తెలిపింది. సాయంత్రం 4 గంటల తర్వాత కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమలో చిరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిసింది. అలాగే, రాత్రి 7 గంటల సమయంలో రెండు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అర్థరాత్రి వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని తెలిపింది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుందంట. వర్షంలేని ప్రాంతాల్లో వెదర్ వేడిగా ఉంటుందంట.

ఇలాంటి పరిస్థితిలో తెలుగు రాష్ట్రాల్లో తేమ రాత్రుల్లో 80 శాతానికి పైగా ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. అలాగే, సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories